Tabs For Students: 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు.. వరుసగా రెండోసారి..ఇకపై అన్ని పాఠాలు..

Andhra Pradesh: పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు, వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన,.. సీబీఎస్ఈ మొదలు ఐబీదాకా అడుగులు పడుతున్నాయి. మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ కాలేజీల్లో సీట్లు అయినా, ఉపాధి అయినా సులభంగా దక్కించుకునే అవకాశం.

Tabs For Students: 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు.. వరుసగా రెండోసారి..ఇకపై అన్ని పాఠాలు..
Tabs Distributed Free
Follow us
P Kranthi Prasanna

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 20, 2023 | 9:44 PM

విజయవాడ, డిసెంబర్ 20; రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లు ఉచితంగా పంపిణీ చేయనుంది ఏపి ప్రభుత్వం…నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి లో లాంఛనంగా ప్రారంభించారు ఏపి సీఎం..దాదాపు 17,500కు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్ దాదాపు 15,500 విలువ గల బైజూస్ కంటెంట్ తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికి రూ. 33,000 లబ్ధి చేకూరానుంది..ప్రస్తుతం అందిస్తున్న 4,34,185 ట్యాబులతో కలిపి ఇప్పటివరకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, బోధిస్తున్న ఉపాధ్యాయులకు 1.305.74 కోట్లవ్యయంతో 9,52,925 ట్యాబులు అండచెయ్యనున్నరు..8వ తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగపడేలా 8వ తరగతితో పాటు 9,10 తరగతుల బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ట్యాబ్ లు అందజేస్తున్నారు… ఇప్పుడు అందించే ట్యాబ్ లలో 11,12 తరగతుల కంటెంట్ కూడా లోడ్ చేసేలా ట్యాబ్ మెమరీ కార్డ్ సామర్థ్యం 256GB కి పెంచి మరీ అందిస్తున్నారు…

ఉచిత ట్యాబ్ లలో…

ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, టోఫెల్ ప్రిపరేషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా అన్ని ట్యాబ్ ల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బాట్ (డౌట్ క్లియరెన్స్ బాట్) అప్లికేషన్.. పిల్లలు సులభంగా విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు వీలుగా డ్యులింగో (DUOLINGO) ఇన్ స్టాల్ చేయబడింది.. ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్లో కూడా పని చేసేలా ఏర్పాటు చేయబడింది.

ఇవి కూడా చదవండి

4 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ఉచితంగా అందిస్తున్న 15,500 విలువైన బైజూస్ కంటెంట్ ఇక 11, 12వ తరగతులకు కూడా అందుబాటులో ఉండనుంది …దిని ద్వారా 34.3 లక్షల మంది విద్యార్థులకు కంటెంట్ రూపేణా లబ్ధి చేకూరింది…

మెమరీ కెపాసిటీ పెంచడంతో పాటు ట్యాబ్ సంరక్షణ కోసం రగ్డ్ కేస్ ఇవ్వనున్నారు….టెంపర్డ్ గ్లాస్ వంటి అదనపు హంగులు కుడా ఉండనున్నాయి…ట్యాబ్ లలో అవాంఛనీయ సైట్లు, యాప్స్ ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్ వేర్ వుంటుంది… 3 ఏళ్ళ పాటు సంపూర్ణ వారంటీ.. ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని సచివాలయాల్లో లేదా మీ హెడ్మాస్టర్ కు ఇవ్వాల్సి వుంటుంది… ఒక వారంలో రిపేర్ చేసి ఇస్తారు లేదా మార్చి వేరేదైనా ఇస్తారు…డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ.. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్.. 45 వేల స్మార్ట్ టీవీలు ఇవ్వనున్నారు..

ఐఎఫ్ పీలు, స్మార్ట్ టీవీలు, ఇంటర్నెట్:

డిజిటల్ విధానంలో బోధనకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి, ఆపైన ప్రతి తరగతి గదిలో ఆన్లైన్ తో పాటు ఆఫ్ లైన్లో కూడా పని చేసేలా బైజూస్ కంటెంట్, ఏపీ ఎస్ఈఆర్ టి తయారు చేసిన ఈ-కంటెంట్ తో కూడిన 62వేల ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్- 1-5 తరగతులకు ప్రతి స్కూల్లో ఒకటి చొప్పున దాదాపు 45 వేల స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తున్నారు…ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులకు డిజిటల్ మౌలిక వసతులు మరింత మెరుగుపరుస్తూ రాష్ట్రవాప్తంగా దాదాపు 45వేల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఫైబర్/ బ్రాడ్ బాండ్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు..అలాగే పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు, వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన,.. సీబీఎస్ఈ మొదలు ఐబీదాకా అడుగులు పడుతున్నాయి…

ఇంటర్నేషనల్ బాకలారియేట్ (IB) గ్లోబల్ బోర్డ్ సర్టిఫికేషన్తో అనుసంధానం ద్వారా మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ కాలేజీల్లో సీట్లు అయినా, ఉపాధి అయినా సులభంగా దక్కించుకునే అవకాశం దక్కుతుంది.  విద్యార్థులను గ్లోబల్ సిటీజన్లుగా తీర్దిదిద్దేలా ఫ్యూచరిస్టిక్ స్కిల్స్లో భాగంగా ఐవోటీ, ఏఐ, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ లిటరసీ, మెటావర్స్, డేటా ఎనలెటిక్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఎల్ఎల్ఎం, వీఆర్, ఏఆర్ వంటి పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తుంది ఏపి ప్రభుత్వం…

వీటన్నిటితో పాటు ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ లో నైపుణ్యం సాధించేలా ఈ ఏడాది ఇప్పటికే టోఫెల్ను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టిన ఏపి ప్రభుత్వం.. 3వ తరగతి నుంచే తర్ఫీదు ఇస్తూ ప్రతి స్కూల్లో టోఫెల్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందచేసింది.. ఈ మేరకు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇచ్చేలా అమెరికన్ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్) తో ఒప్పందం కుడా కుదుర్చుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..