Telangana: హైదరాబాద్ పాతబస్తీ రౌడీషీటర్‌కు ఈడీ సమన్లు.. నేర చరిత్ర చూసి ఖంగుతిన్న ఖాకీలు
తెలంగాణలో రౌడీషీటర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ పాతబస్తీలో పేరుమోసిన ఓ గ్యాంగ్‌స్టర్, రౌడీషీటర్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈ రౌడీషీటర్‌కు సుమారు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. చిల్లర దొంగతనాల నుంచి మొదలైన ఈ గ్యాంగ్‌స్టర్ జీవతం వెయ్యి కోట్ల వరకు ఎలా సంపాదించాడనే విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు షాక్ అయ్యారు. విచారణ కోసం పోలీసులు ఈడీకి సమాచారం ఇచ్చారు..

హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణలో రౌడీషీటర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ పాతబస్తీలో పేరుమోసిన ఓ గ్యాంగ్‌స్టర్, రౌడీషీటర్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈ రౌడీషీటర్‌కు సుమారు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. చిల్లర దొంగతనాల నుంచి మొదలైన ఈ గ్యాంగ్‌స్టర్ జీవతం వెయ్యి కోట్ల వరకు ఎలా సంపాదించాడనే విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు షాక్ అయ్యారు. విచారణ కోసం పోలీసులు ఈడీకి సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆ రౌడీషీటర్‌కు సమన్లు ఇచ్చింది. ఇవాళ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.
సాధారణంగా వ్యాపార లావాదేవీలు, అక్రమ సంపాదన, స్కాముల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఈడీ సమన్లు ఇచ్చి విచారణ జరపడం చూస్తుంటాం. అలాగే హైదరాబాద్ పాతబస్తీ అనగానే హత్యలు, దందాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. కానీ రౌడీషీటర్‌కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇప్పుడు హైదరాబాద్ పాతబస్తీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రౌడీషీటర్ ఆగడాలు అన్నీఇన్నీ కాదు. చిల్లర దొంగతనాల నుంచి మొదలైన ఇతని జీవితం కిడ్నాప్‌లు, హత్యలు, ల్యాండ్ సెటిల్‌మెంట్లు, దందాలు చేసుకునే స్థాయికి విస్తరించింది. ఈ క్రమంలోనే దందాలు చేస్తూ వెయ్యి కోట్ల ఆస్తులు కూడగట్టినట్లు అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ రౌడీషీటర్‌కు పలు రాజకీయ పార్టీ నేతల అండదండలు, స్థానిక పోలీసుల సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అవసరానికి అటు రాజకీయ నాయకులకు, ఇటు కొంతమంది పోలీసులకు డబ్బులు చేస్తూ మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపణలూ లేకపోలేదు.
ప్రభుత్వాలు, పోలీసులు మారినా తనకు అనుకూలంగా మలుచుకుంటూ దందాలు చేస్తుంటారు. హైదరాబాద్ చరిత్రలోనే ఓ రౌడీషీటర్‌కు ఈడీ సమన్లు ఇవ్వడం మొట్ట మొదటిసారిగా కావడం విశేషం. అయితే దీని నుంచి బయటపడేందుకు ఆ రౌడీషీటర్ పలువురు రాజకీయ సంప్రదించాడని.. న్యాయవాదులతోనూ చర్చలు జరుపుతున్నాడని సమాచారం. దీంతో హైదరాబాద్ పాతబస్తీలోని రౌడీషీటర్లు, గ్యాంగ్‌స్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. తమకు ఎలాంటి సమన్లు వస్తాయోనన్న ఆందోళన వారిలో నెలకొంది. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈడీ విచారణలో తమ పేర్లు బయటపడితే ఎలా అంటూ ఇంతకాలం ఆ గ్యాంగ్‌స్టర్‌కు సహకరించిన పలు రాజకీయ పార్టీల నేతలు, పోలీసులు భయపడిపోతున్నారు. మరోవైపు ఈ విషయం తెలిసిన పలువురు హైదరాబాద్‌లోని రౌడీషీటర్లు, గ్యాంగ్‌స్టర్లు మకాంలు మార్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.