Local Body Election: ఇంకా ప్రారంభం కాని పంచాయతీ ఎన్నికల హడావిడి.. స్పష్టత లేని రిజర్వేషన్లు!

తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కాలం మరో 40 రోజుల్లో ముగుస్తుంది. అయితే, ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికల విషయంలో స్పష్టత లేదు. ప్రభుత్వం మారడంతో ఈసారి ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి ఎలాంటి హడావిడి కనబడటం లేదు.

Local Body Election: ఇంకా ప్రారంభం కాని పంచాయతీ ఎన్నికల హడావిడి.. స్పష్టత లేని రిజర్వేషన్లు!
Telangana Local Body Election
Follow us
G Sampath Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Dec 20, 2023 | 1:51 PM

తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కాలం మరో 40 రోజుల్లో ముగుస్తుంది. అయితే, ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికల విషయంలో స్పష్టత లేదు. ప్రభుత్వం మారడంతో ఈసారి ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి ఎలాంటి హడావిడి కనబడటం లేదు. అదే విధంగా గత ప్రభుత్వం రిజర్వేషన్లను పదేళ్ల వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలోనే పాత పద్దతి అవలంభిస్తుందా..? లేదంటే రిజర్వేషన్లు ఏమైనా మార్పులు తెచ్చే విషయంలో క్లారిటీ లేదు.. మొత్తానికి.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రస్తుతానికి సందిగ్ధత నెలకొంది.

తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. పంచాయతీ ఎన్నికల విషయంలో ఆచితూచి స్పందిస్తుంది. ముందుగా పాలనపై దృష్టి పెట్టిన తరువాతనే, పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించినా, క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉంది. సర్పంచ్ ఎన్నికలకు, పార్టీ సింబల్ లేనప్పటికీ, అయా పార్టీల మద్దతుదారులనే అభ్యర్థులుగా భావిస్తారు. దీంతో.. ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో పట్టు వచ్చిన తరువాతే, పంచాయతీ ఎన్నికలను నిర్వహించే ఆవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలావుంటే జనవరి 31వ తేదీతో గ్రామ సర్పంచ్ పదవి కాలం ముగుస్తుంది. ఆలోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనవరిలో ఎన్నికలు సాధ్యం కాకపోచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ మాత్రం పార్లమెంటు ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ నుంచి అత్యధికంగా సీట్ల సాధించాలని ఫోకస్ పెట్టింది. ఇప్పటికే.. రైతు భరోసా, రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం క్లారీటీ ఇచ్చిన తరువాత.. పంచాయతీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

గత సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. మరోవైపు సర్పంచ్‌లకు పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో గత ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులు. తమకు పూర్తి స్థాయిలో బిల్లులు ఇచ్చిన తరువాతనే ఎన్నికలకు వెళ్లాలని కోరుతున్నారు. అలాగే రిజర్వేషన్ యధావిధిగా కొనసాగించాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. అయితే.. కాంగ్రెస్ మాత్రం అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అధికార పార్టీ భావిస్తోంది. ఈ కారణంగానే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన హడావిడి మాత్రం మొదలు కాలేదు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే సర్పంచ్ ఎన్నికల విషయంలో మరో వారం రోజుల్లో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…