AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కనువిందు చేస్తున్న బ్రహ్మ కమలం పుష్పాలు.. పండగ సమయంలోనే వికసిస్తున్న పువ్వులు

బ్రహ్మ కమలం చెట్టు ఒకేసారి వందకు పైగా పువ్వులు పూసింది. అద్భుతమైన వాసనతో ఉండే బ్రహ్మ కమలం అర్ధరాత్రి సమయంలో వికసించి కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉండి వాడిపోతాయి. బ్రహ్మ కమలాలు గత నాలుగేళ్లుగా సత్యనారాయణ ఇంట్లో పూస్తున్నాయి. ప్రతీ సారి కేవలం ఒక ఐదు నుండి పది లోపు పూసే పువ్వులు ఈసారి మాత్రం ఏకంగా వందకు పైగా పూలు పూయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెపుతున్నారు.

Telangana: కనువిందు చేస్తున్న బ్రహ్మ కమలం పుష్పాలు.. పండగ సమయంలోనే వికసిస్తున్న పువ్వులు
Brahma Kamal Flowers
N Narayana Rao
| Edited By: |

Updated on: Oct 10, 2024 | 12:52 PM

Share

బ్రహ్మ కమలం పుష్పం హిందూ ప్రాముఖ్యతను కలిగి ఉండటంతో పాటుగా కోరికలు తీర్చే శక్తి ఉందని నమ్ముతారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన బ్రహ్మ కమలం పుష్పాలు తల్లంపాడు గ్రామంలో ఓ ఇంట్లో వికసించాయి. ఖమ్మం జిల్లా రూరల్ మండలం తల్లంపాడు లో బ్రహ్మ కమలాలు వికసించాయి. గ్రామానికి చెందిన కొండమీది సత్యనారాయణ ఇంట్లో ఉన్న బ్రహ్మ కమలం చెట్టు ఒకేసారి వందకు పైగా పువ్వులు పూసింది. అద్భుతమైన వాసనతో ఉండే బ్రహ్మ కమలం అర్ధరాత్రి సమయంలో వికసించి కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉండి వాడిపోతాయి. బ్రహ్మ కమలాలు గత నాలుగేళ్లుగా సత్యనారాయణ ఇంట్లో పూస్తున్నాయి.

ప్రతీ సారి కేవలం ఒక ఐదు నుండి పది లోపు పూసే పువ్వులు ఈసారి మాత్రం ఏకంగా వందకు పైగా పూలు పూయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెపుతున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఈ పూలు ఏదో ఒక పండుగ సందర్భంగానే పూయడం గమనార్హం. ఈసారి దేవీ నవరాత్రుల సందర్భంగా పెద్ద సంఖ్యలో పువ్వులు పూయడం తో సత్యనారాయణ కుటుంబ సబ్యులతో పాటు గ్రామస్తులు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us