Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmotsavam 2024: ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యప్రభ వాహన దర్శనం.. రామకృష్ణ గోవింద అలంకారంలో భ‌క్తుల‌ను క‌టాక్షించిన శ్రీవారు

శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంలో ఊరేగుతుంటే.. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలను కనులారా దర్శించుకుని తరించేందుకు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకున్న భక్తులు ఈ విశేష సేవను దర్శించుకున్నారు.

Brahmotsavam 2024: ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యప్రభ వాహన దర్శనం.. రామకృష్ణ గోవింద అలంకారంలో భ‌క్తుల‌ను క‌టాక్షించిన శ్రీవారు
Surya Prabha Vahanam
Follow us
Surya Kala

|

Updated on: Oct 10, 2024 | 1:41 PM

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంలో సూర్యమండల మధ్యస్థుడైన హిర‌ణ్మ‌య స్వరూపుడిగా శ్రీ మలయప్ప స్వామి రామకృష్ణ గోవింద అలంకారంలో భ‌క్తుల‌ను క‌టాక్షించారు. శంఖు చ‌క్రాలు, క‌త్తి, విల్లు, బాణం, వ‌ర‌ద హ‌స్తంతో భ‌క్తుల‌కు దర్శనం ఇచ్చారు. సూర్య ప్రభ వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలను కనులారా దర్శించుకుని తరించేందుకు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకున్న భక్తులు ఈ విశేష సేవను దర్శించుకున్నారు. స్వామివారికి అడుగడుగునా కర్పూరహారతులు ఇచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు.

సూర్యప్రభ వాహన దర్శనం ఆరోగ్య ప్రాప్తి

ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాతగా పురాణాల కథనం. అంతేకాదు రాత్రికి రాజు, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తాడు. బ్రహ్మోత్సవంలో శ్రీవారు ఏడో రోజు ఊరేగే సూర్యప్రభ వాహనం సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని పిలుస్తూ పూజిస్తాం. సూర్యప్రభ వాహనంలో తన దేవేరులతో కలిసి ఊరేగే మలయప్ప మివారిని దర్శించిన భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, మంచి సంతానం, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.

ఇవి కూడా చదవండి

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..