NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో కలకలంరేపుతోన్న ఎన్‌ఐఏ సోదాలు.. ఆ నేతల ఇళ్లలో కొనసాగుతోన్న
ఇదిలా ఉంటే ఏపీ విషయానికొస్తే.. నెల్లూరు జిల్లాలోని వెంకటేశ్వర్లు, తిరుపతిలో క్రాంతి చైతన్య, హైదరాబాద్ లోని భవాని, అన్నపూర్ణ, అనూష, పౌర హక్కుల సంఘం నేత సురేష్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలు ఎందుకు జరుగుతున్నాయన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎన్‌ఐఏ సోదాల నేపథ్యంలో స్థానిక పోలీసులు...
తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు, తెలంగాణలోనూ సోమవారం కొందరు నేతల ఇళ్లలో సోదాలు జరగడం అందరినీ కలవరానికి గురి చేసింది. మొత్తం 60 చోట్ల ఒకకాలంలో సోదాలు జరుగుతుననట్లు తెలుస్తోంది. కొందరు న్యాయవాదులు, పౌరహక్కుల సంఘం నేతల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. అమర బంధుమిత్రుల సంఘం, పౌర హక్కుల నేతల సంఘం ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఏపీ విషయానికొస్తే.. నెల్లూరు జిల్లాలోని వెంకటేశ్వర్లు, తిరుపతిలో క్రాంతి చైతన్య, హైదరాబాద్ లోని భవాని, అన్నపూర్ణ, అనూష, పౌర హక్కుల సంఘం నేత సురేష్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలు ఎందుకు జరుగుతున్నాయన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎన్‌ఐఏ సోదాల నేపథ్యంలో స్థానిక పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా తిరుపతిలో ఉన్న న్యాయవాది క్రాంతి చైతన్య, నెల్లూరులో ఉన్న అరుణ, గుంటూరుకు చెందిన డాక్టర్ రాజారావు, ప్రకాశంలోని చీమకుర్తికి చెందిన దుడ్డు వెంకట్రావు, సంతమాగూలూరులో ఓరు శ్రీనివాస రావు, రాజమంత్రిలోని బొమ్మెరలో పౌర హక్కుల నేత నాజర్, హార్లిక్స్ ఉద్యోగి కోనాల లాజర్, శ్రీకాకుళం జిల్లాలో కేఎన్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిస్కా కృష్ణయ్య ఇళ్లలో కూడా ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లోనూ ఎన్‌ఐఏ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలోని విద్యానగర్‌కు చెందిన న్యాయవాది సురేష్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సురేష్ కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తుండడం గమనార్హం. వీరికి మావోయిస్టులతో సంబధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. వీరు దళంలోకి సభ్యులను రిక్రూట్‌మెంట్ చేయడంలో సహయసహకారాలు అందిస్తున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో దాడులు కొనసాగుతున్నాయి. అయితే సోదాల్లో ఎలాంటి విషయాలు వెల్లడయ్యాయన్నదానిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..