సర్పంచ్ వర్సెస్ ఎమ్మెల్యేః నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై అవినీతి ఆరోపణలు.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా సర్పంచ్

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై వెలినేడు గ్రామ సర్పంచ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

సర్పంచ్ వర్సెస్ ఎమ్మెల్యేః నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై అవినీతి ఆరోపణలు.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా సర్పంచ్
Veliminedu Sarpanch Suicide Attempt
Balaraju Goud

|

Mar 24, 2021 | 1:08 PM

Nakrekal mla v/s Sarpanch: నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై వెలినేడు గ్రామ సర్పంచ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. గ్రామానికి చుట్టుపక్కల ఉన్న కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేయలేదని నన్ను సస్పెండ్ చేయించారని మాజీ సర్పంచ్ ఆరోపించింది. తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందే ఆత్మహత్యయత్నం చేసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే లింగయ్య ఖండించారు.

ఇటీవల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన దేశబోయిన మల్లమ్మ సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తనను అకారణంగా సస్పెండ్ చేయించారని మల్లమ్మ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆమెకు మద్దతుగా టీఆర్ఎస్ వార్డ్ మెంబర్లు కూడా ధర్నాలో పాల్గొన్నారు. హరితహారంలో అలసత్వం అంటూ సాకులు చూపించి తనను సస్పెండ్‌ చేయించారని సర్పంచ్ మల్లమ్మ మండిపడ్డారు.

ఇదే క్రమంలో చిరుమర్తి లింగయ్య డబ్బుల కోసం వేధిస్తున్నాడంటూ మల్లమ్మ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందే ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను స్థానికులు శాంతింప చేశారు. స్థానికులు అడ్డుకోవడంతో మల్లమ్మ.. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ తనకు న్యాయం చేయాలని కోరారు. తనపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని అభ్యర్థించారు. ఇదిలావుంటే సర్పంచ్‌ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదంటూ.. చిరుమర్తి లింగయ్య కొట్టిపారేస్తున్నారు.

ఇదంతా జరుగుతుండగానే ఈ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. మల్లమ్మను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆమెకు ఫోన్ చేసిన లింగయ్య.. వివాదాన్ని పెంచుకోవద్దంటూ సర్దిచెప్పారు.

Read Also…  Coronavirus: మళ్లీ విరుచుకుపడుతున్న కరోనా… నిన్న ఒక్క రోజు 3,251 మంది మృతి.. కరోనా లెక్కల జాబితాలో రెండో స్థానం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu