AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన.. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన భర్త.. ఏం చేశాడో తెలిస్తే షాక్..

Husband Kills wife : చిన్న చిన్న కారణాలకే భార్యభర్తల మధ్య సంబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. మనస్పర్ధలు వచ్చి ఒకరినొకరు చంపుకుంటున్నారు.

రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన.. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన భర్త.. ఏం చేశాడో తెలిస్తే షాక్..
Husband Kills Wife
uppula Raju
|

Updated on: Mar 24, 2021 | 12:57 PM

Share

Husband Kills wife : చిన్న చిన్న కారణాలకే భార్యభర్తల మధ్య సంబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. మనస్పర్ధలు వచ్చి ఒకరినొకరు చంపుకుంటున్నారు. అనుమానంతో కొందరైతే.. తాగుడుకు బానిసై మరికొందరు ఇలా పచ్చని కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. అభం శుభం తెలియని పిల్లలను అనాథలుగా మార్చుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అసిఫాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన రవి తన తల్లి, భార్య సమతలతో కలిసి రాజేంద్ర నగర్ హైదర్ గూడలో నివాసముంటున్నాడు. కొంత కాలంగా భార్యకు, తల్లికి మధ్య గొడవల కారణంగా ఇంట్లో విభేదాలు చెలరేగాయి. తన తల్లిని సరిగ్గా చూసుకోవడంలేదని రవి, భార్య సమతతో నిత్యం వాదించేవాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి మద్యం తాగొచ్చిన రవి భార్యతో గొడవపడి క్షణికావేశంలో సమత గొంతు నులిమి హత్య చేసాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Price Hike: ఏప్రిల్‌ 1 నుంచి బాదుడే.. బాదుడు.. వీటి ధరలు భారీగా పెరగనున్నాయి…కొనాలంటే ఇప్పుడే కొనేయండి..!

Payal Rajput : క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రాళ్ళ మతిపోగొడుతున్న ‘ఆర్ఎక్స్100’ భామ.. ఆకట్టుకుంటున్న వీడియో

Telangana Assembly Sessions Live Updates: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. వీకెండ్ లాక్‌డౌన్‌.. థియేటర్లు మళ్లీ బంద్‌..?