AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Cement: మై హోమ్ ఇండస్ట్రీస్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్.. ఏ రంగంలో అవార్డు వచ్చిందంటే..?

కస్టమర్లకు నాణ్యమైన సిమెంటును అందిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న మహా సిమెంట్‌కు అవార్డుల పంట పండుతుంది. సున్నపురాయి గనుల నిర్వహణలో జాతీయస్థాయిలో మహా సిమెంట్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులను దక్కించుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా కంపెనీ ఎండీ జూపల్లి రంజిత్ రావు, యూనిట్ హెడ్ శ్రీనివాసరావు ఈ అవార్డులను అందుకున్నారు.

Maha Cement: మై హోమ్ ఇండస్ట్రీస్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్.. ఏ రంగంలో అవార్డు వచ్చిందంటే..?
My Home Industries
M Revan Reddy
| Edited By: Krishna S|

Updated on: Jul 08, 2025 | 1:30 PM

Share

సిమెంట్ రంగంలో రారాజుగా నిలుస్తోంది మహా సిమెంట్. సిమెంట్ తయారీలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నందుకు మై హోమ్ ఇండస్ట్రీస్‌కు అవార్డులు వస్తున్నాయి. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ సున్నపురాయి గనుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తోంది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన మేళ్లచెరువు, చౌటుప్పల్, వేపలమాధవరం సున్నపు రాయి గనుల నిర్వహణకు గాను 2023-24 ఏడాదికి జాతీయ స్థాయిలో అత్యుత్తమమైన ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులను దక్కించుకున్నది. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని   జైపూర్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా కంపెనీ ఎండీ జూపల్లి రంజిత్ రావు, యూనిట్ హెడ్ శ్రీనివాసరావు ఫైవ్ స్టార్ అవార్డును అందుకున్నారు.

మై హోమ్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన గనుల నిర్వహణ విషయంలో శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నామని ఎండీ జూపల్లి రంజిత్ రావు, యూనిట్ హెడ్ శ్రీనివాసరావులు తెలిపారు. పరిశ్రమకు చెందిన మూడు గనులకు ఒకేసారి ఫైవ్ స్టార్ట్ రేటింగ్ అవార్డు రావడం ఎంతో గొప్ప విషయమన్నారు. సంస్థ చేపట్టిన సస్టైనబుల్ డెవలప్‌మెంట్, మినరల్ కన్జర్వేషన్, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలు.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డు అందుకున్నట్లు తెలిపారు. గనుల పరిరక్షణకు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను పాటిస్తూ శాస్త్రీయమైన పద్ధతులను అవలంబిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, కార్మికుల యొక్క సమిష్టి కృషితో ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకోవటం సాధ్యమైందని చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులను ఎండ జూపల్లి రంజిత్ అభినందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..