Telangana: తెలంగాణలో ఎన్నికల వేళ కొలువులపై రాజకీయ కొట్లాట.. ‘వీకెండ్ అవర్’ స్పెషల్..

కొలువుల కోసం కొట్లాట. తెలంగాణలో బర్నింగ్‌ పొలిటికల్‌ ఇష్యూ. ఎన్నికలు దగ్గర పడటంతో ఈ సమస్యకు మరింత హైప్‌ వస్తోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్‌కు చేరుకుంటోంది. ఇంతకీ సమస్య రాజకీయల చుట్టూ తిరుగుతోందా? లేక ఇంకేదైనా కారణం ఉందా? ఎవరి వాదన ఏంటి?

Telangana: తెలంగాణలో ఎన్నికల వేళ కొలువులపై రాజకీయ కొట్లాట.. ‘వీకెండ్ అవర్’ స్పెషల్..
Weekend Hour
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 15, 2023 | 7:01 PM

కొలువుల కోసం కొట్లాట. తెలంగాణలో బర్నింగ్‌ పొలిటికల్‌ ఇష్యూ. ఎన్నికలు దగ్గర పడటంతో ఈ సమస్యకు మరింత హైప్‌ వస్తోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్‌కు చేరుకుంటోంది. ఇంతకీ సమస్య రాజకీయల చుట్టూ తిరుగుతోందా? లేక ఇంకేదైనా కారణం ఉందా? ఎవరి వాదన ఏంటి?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయం రంగులు మారుతోంది. రణతంత్రపు టెత్తుల్లో కొత్త పోకడలు.. సరికొత్త అంశాలు వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో విపక్షాలకు బర్నింగ్‌ టాపిక్‌ నిరుద్యోగ సమస్య, టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ. తీగ లాగితే డొంక కదిలినట్టు సర్వీస్‌ కమిషన్‌లో అక్రమాల పుట్ట పగిలింది. సిట్‌ ఎంట్రీ తర్వాత వెలుగు చూసిన అంశాలతో గ్రూప్‌ వన్‌ ప్రిలిమినరీ పరీక్ష, ఏఈఈ తోపాటు మరో రెండు పరీక్షలు రద్దయితే మరికొన్ని వాయిదా పడ్డాయి. విద్యార్థి, యువజన సంఘాలు భగ్గుమన్నాయి.

విపక్ష పార్టీల ఉడుంపట్టుతో సమస్య పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. హన్మకొండ నుంచి నిరుద్యోగ మార్చ్‌ చేపట్టింది బీజేపీ. అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ప్రయత్నించడంతో ఉద్రిక్తతకూ దారితీసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహాలో ఉద్యమాలు చేయడానికి కమలనాథులు సన్నద్ధం అవుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారనేది బీజేపీ వాదన. అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి రెండున్నర లక్షల వరకు ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని పదే పదే చిట్టా విప్పుతోంది. నిరుద్యోగ భృతిపైనా అనేక సందర్భాలలో ప్రశ్నలు సంధించారు బీజేపీ నేతలు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌ కూడా ప్రశ్నాపత్రాల లీకేజీ.. నిరుద్యోగుల సమస్యను రాజకీయ కోణంలోనే టేకప్‌ చేసింది. ఏకంగా ఈడీ తలుపు తట్టారు పీసీసీ చీఫ్. గజ్వేల్‌లో నిరుద్యోగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది కాంగ్రెస్‌ పార్టీ. అయితే నిరుద్యోగుల సమస్యకు పొలిటికల్‌ కలర్‌ ఇవ్వడంపై విపక్షాల తీరును తీవ్రంగా ఎండగడుతోంది అధికారపార్టీ బీఆర్‌ఎస్‌. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారనేది బీఆర్‌ఎస్‌ ఆరోపణ. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం భర్తీ చేపట్టిన లెక్కల చిట్టాను బయట పెడుతోంది. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. నిరుద్యోగుల అంశం ఎన్నికల్లో కీలకంగా మారే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లక్షల మంది యువతకు సంబంధించిన అంశం కావడంతో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. అందుకే రానున్న రోజుల్లో ఈ కొలువుల కొట్లాట రాజకీయంగా మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.

వీకెండ్ అవర్ లైవ్ డిస్కర్షన్ కింద చూడొచ్చు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..