Plant a Tree Program: మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్.. కేసీఆర్ పుట్టిన గంటలో కోటి మొక్కలు..!

Plant a Tree Program: ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఏ కార్యక్రమం చేపట్టినా అది దాదాపు ప్రకృతికి సంబంధించే ఉంటుంది.

  • Shiva Prajapati
  • Publish Date - 10:28 am, Mon, 15 February 21
Plant a Tree Program: మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్.. కేసీఆర్ పుట్టిన గంటలో కోటి మొక్కలు..!

Plant a Tree Program: ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఏ కార్యక్రమం చేపట్టినా అది దాదాపు ప్రకృతికి సంబంధించే ఉంటుంది. ఇప్పటికే ఆయన ‘గ్రీన్ ఛాలెంజ్’ పేరుతో తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా, యావత్ దేశ వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌కు ఎంతో మంది ప్రముఖులు సైతం స్పందించి తమ తమ పరిధిలో మొక్కలు నాటారు కూడా. తాజాగా మరో బృహత్తర కార్యక్రమానికి ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న ‘కోటి వృక్షార్చన’ పేరుతో భారీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి పుట్టిన రోజున ఒక్క గంటలో కోటి మొక్కలు నాటి రికార్డ్ సృష్టించి, దానిని కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలనేది సంకల్పం అని ఎంపీ సంతోష్ కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ప్రజలు సహా, సీఎం కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు, వ్యాపార, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయంతంగా చేయాల్సిందిగా కోరారు. ఇకపోతే.. సంతోష్‌ కుమార్ పిలుపునకు విశేష స్పందన వస్తోంది. చెట్లు నాటే కార్యక్రమంలో తాముసైతం పాల్గొంటామంటూ పలువురు ప్రముఖులు ప్రకటిస్తున్నారు.

Also read:

Mahesh and Namrata :వాలంటైన్స్‌ డేకి సర్‌ప్రైజ్ గిప్ట్ అందుకున్న మహేష్, నమ్రత దంపతులు

Nellore District: నెల్లూరు జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి..