నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎటువంటి పరీక్ష లేకుండానే 10వ తరగతి అర్హతతో పోస్టల్ లో ఉద్యోగాలు ఎలా అప్లై చేయాలంటే..

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. పోస్టల్ లో భారీ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. . తెలంగాణ లోని పోస్టల్ సర్కిల్ లో 1150 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులని భర్తీ చేయడానికి...

  • Surya Kala
  • Publish Date - 11:12 am, Mon, 15 February 21
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎటువంటి పరీక్ష లేకుండానే 10వ తరగతి అర్హతతో పోస్టల్ లో ఉద్యోగాలు ఎలా అప్లై చేయాలంటే..

Telangana Postal jobs : తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. పోస్టల్ లో భారీ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. . తెలంగాణలోని పోస్టల్ సర్కిల్ లో 1150 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులని భర్తీ చేయడానికి భారత పోస్ట్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 26 చివరి తేదీ.

ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలను https://appost.in/ చూసి తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి..  నోటిఫికేషన్ లో ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు ఉన్నాయి. కనుక పూర్తిగా నోటిఫికేషన్ చదివి అనంతరం దరఖాస్తు చేసుకోవాలి.  తెలంగాణాలో మొత్తం గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు 1150 ఉన్నాయి. వాటిలో జనరల్ కేటగిరీలో  484, ఓబీసీ- 279, ఈడబ్ల్యూఎస్- 130, పిడబ్ల్యూడీ -ఏ  9, పిడబ్ల్యూడీ -బీ- 14, పిడబ్ల్యూడీ -సి 15, ఎస్సీ- 154, ఎస్టీ- 65 పోస్టుల్ని కేటాయించారు.

ఇక ఈ పోస్టులకు విద్యార్హతల విషయానికివస్తే..టెన్త్ ఉత్తీర్ణతకావాలి. ముఖ్యంగా స్థానిక భాషకు సంబంధించిన పరిజ్ఞానం అవసరం.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే ఎస్సి, ఎస్టీ, మహిళలు, ట్రాన్సవుమెన్‌, దివ్యంగులకు ఎటువంటి దరఖాస్తు ఫీజులేదు.మిగిలిన వారు దరఖాస్తు  ఫీజు గా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థి వయస్సు 2021 జనవరి 27 నాటికి 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికీ వారి పోస్టుల ఆధారంగా జీతాన్ని చెల్లిస్తారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టు కు రూ. 12,000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కు గ్రామీణ డాక్ సేవక్ పోస్టుకు రూ 10,000 లు స్టార్టింగ్ జీతంగా ఇస్తారు.

Also Read:

మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్.. కేసీఆర్ పుట్టిన గంటలో కోటి మొక్కలు..!

 ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల కన్నీళ్లు.. ధర బాగా ఉన్న సమయంలో జెమిని వైరస్ అటాక్