స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని కన్న తల్లిపై దాడి.. రోకలి బండ తలపై కొట్టి.. ఆఖరుకు

సెల్ ఫోన్లు నిత్య జీవితంలో భాగమయ్యాయి. వాటి మైకంలో పడి చుట్టూ జరుగుతున్న వాటిని పట్టించుకోని వారు ఎందరో.. అయితే కరోనా కారణంగా ఆన్లైన్ పుణ్యమా అని ఇప్పుడు చిన్నపిల్లలూ స్మార్ట్ ఫోన్(Smart Phone) కు అలవాటయ్యారు....

స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని కన్న తల్లిపై దాడి.. రోకలి బండ తలపై కొట్టి.. ఆఖరుకు
Chennai Murder
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 26, 2022 | 1:08 PM

సెల్ ఫోన్లు నిత్య జీవితంలో భాగమయ్యాయి. వాటి మైకంలో పడి చుట్టూ జరుగుతున్న వాటిని పట్టించుకోని వారు ఎందరో.. అయితే కరోనా కారణంగా ఆన్లైన్ పుణ్యమా అని ఇప్పుడు చిన్నపిల్లలూ స్మార్ట్ ఫోన్(Smart Phone) కు అలవాటయ్యారు. అయితే సెల్ ఫోన్ కొనివ్వాలంటూ ఓ యువకుడు తన తల్లిని దారుణంగా హత్య(Murder) చేశాడు. రోకలితో తలపై కొట్టి మరీ అంతమొందించాడు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి(Undavalli) మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు. లక్ష్మి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద కుమారుడు మహేశ్‌ ఇంటర్‌ పూర్తి చేశాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలని తల్లిని కోరాడు. డబ్బులు లేవని, తర్వాత కొనిస్తానని తల్లి చెప్పింది. అయినా మహేశ్ ప్రవర్తన మార్చుకోలేదు. స్మార్ట్ ఫోన్ కొనివ్వాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ విషయంపై తల్లీ కుమారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి తల్లితో గొడవపడ్డాడు. ఆవేశంతో రోకలిబండతో తల్లి తలపై కొట్టాడు. ఆమె తీవ్రగాయాలపాలై కింద పడిపోయింది.

విషయం తెలుసుకున్న స్థానికులు 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేటప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇటీవల లక్ష్మి మరో కుమారుడు సాల్మన్‌ కారు అద్దాలు పగులగొట్టి ఇద్దరిని గాయపరిచాడు. ఈ ఘటనలో అతను జైలుకూ వెళ్లాడు. తమ్ముడిని జైలుకు పంపించిన వారిపై మహేశ్ కక్ష పెంచుకున్నాడు. మూడు రోజుల క్రితం రైతులు పొలాల్లో మిరప కట్టెకు నిప్పు పెట్టాడు. ఆ సమయంలో అందులోకి దూకడంతో చేతులకు గాయాలయ్యాయి. కుమారుడి గాయాలకు మందు పూసేందుకే లక్ష్మి కూలి పనులకు వెళ్లకుండా ఇంటి వద్ద ఉందని, ఇదే సమయంలో సెల్ ఫోన్ విషయంలో ఘర్షణ జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.

Also Read

MODI STORY: ఛాయ్‌వాలా నుంచి ప్రధాని దాకా మోడీ ప్రస్థానం.. పోర్టల్ ప్రారంభించిన మహాత్మా గాంధీ మనవరాలు

Hyderabad: తవ్వకాల్లో బయటపడిన పురాతన అమ్మవారి విగ్రహం.. అదృష్టం అంటూ భక్తులు ప్రత్యేక పూజలు

Hridayam Remake: ‘హృదయం’పై మనసుపారేసుకున్న బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యుసర్‌.. తెలుగుతో పాటు మరో రెండు భాషల్లో..