Hyderabad Crime: అనుమానంతో గొంతు నులిమి చంపేశాడు.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి కటకటాలపాలయ్యాడు

తల్లికి చేదోడుగా ఉండాలని భావించిన ఆ యువతి ఓ సంస్థలో ఉద్యోగానికి చేరింది. అక్కడ సంస్థ నిర్వాహకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో యువతి...

Hyderabad Crime: అనుమానంతో గొంతు నులిమి చంపేశాడు.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి కటకటాలపాలయ్యాడు
woman murder
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 26, 2022 | 1:46 PM

తల్లికి చేదోడుగా ఉండాలని భావించిన ఆ యువతి ఓ సంస్థలో ఉద్యోగానికి చేరింది. అక్కడ సంస్థ నిర్వాహకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో యువతి ప్రవర్తనపై యువకుడికి అనుమానం ఏర్పడింది. వేరే అబ్బాయితో మాట్లాడుతున్నావంటూ గొడవకు దిగాడు. మాటా మాటా పెరగడంతో తీవ్ర ఆవేశానికి లోనై గొంతు నులిమి చంపేశాడు(Murder). ఆత్మహత్య(Suicide) గా చిత్రించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆఖరుకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. హైదరాబాద్(Hyderabad) లోని శేరిలింగంపల్లి కాలనీలో ఉమారాణి అనే మహిళ తన కుమార్తె సౌజన్యతో కలిసి నివాసముంటోంది. సౌజన్య బాచుపల్లిలోని ఓ కళాశాలలో బీటెక్‌ చదువుతోంది. తండ్రి చనిపోవడంతో తల్లికి ఆసరాగా ఉండేందుకు చందానగర్‌ జీటీజీ ఇన్ఫోటెక్‌ సొల్యూషన్స్‌లో పని చేస్తోంది. ఈ సంస్థను గుంటూరు జిల్లా రొంపిచర్లకు చెందిన చల్లా విజయ్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. విజయ్ కుటుంబం చాలా కాలం క్రితమే నగరానికి వచ్చి చందానగర్‌లో నివాసం ఉంటోంది. ఒకే సంస్థలో పని చేస్తుండటంతో విజయ్, సౌజన్యల మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు.

అయితే సౌజన్య వేరే వ్యక్తితో మాట్లాడుతోందని విజయ్‌ అనుమానం పెంచుకున్నాడు. ఇతరులతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. మాటామాటా పెరిగి చేయి చేసుకున్నాడు. మరుసటి రోజు సాయంత్రం ల్యాప్‌టాప్‌ కోసం సౌజన్య ఇంటికి వచ్చాడు. అదే సమయంలో ఆమె తల్లి పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్లింది. ఆ సమయంలో ఇరువురి మధ్య మళ్లీ గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహంతో విజయ్ సౌజన్య గొంతు నులిమి ఊపిరాడకుండా చేశాడు.

ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఫ్యాన్‌కు చీరకట్టి ఆమె మెడ చుట్టూ బిగించాడు. తరువాత కింద పడుకోబెట్టి బయటకి వచ్చాడు. పక్క ఇంటి వారి దగ్గరకి వెళ్లి సౌజన్య పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తోందని చెప్పాడు. దీంతో వారు అసలు ఈ సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నావంటూ ప్రశ్నించారు. సమాధానాన్ని దాటవేసి విజయ్‌ అక్కడ నుంచి జారుకొని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్ ను అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు.

ఇవీచదవండి.

అందాల దీపికా అంటే అభిమానులకు ఎంత ఇష్టమో తెలుసా..

Telangana Ministers: ఉగాది తర్వాత వరి వార్‌.. రైతుల ఉద్యమం ముందు కేంద్రం తల వంచాల్సిందేః మంత్రి నిరంజన్ రెడ్డి

Accident: బైక్ పై నుంచి కిందపడి లేవబోతుండగా.. యువకుడి తలపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు