Telangana: కన్న పేగు ప్రేమను అణచుకుని.. కొడుకుకు మరణ శాసనం రాసిన తల్లి..!
పెళ్లి అయిన తర్వాత కొడుకు ప్రవర్తనలో మార్పు రాలేదు. బాధ్యతగా వ్యవహరిస్తూ తల్లి , భార్య పిల్లలను పోషించాలి. కానీ ఏ మాత్రం కుటుంబం పట్ల బాధ్యత లేకుండా.. మద్యానికి బానిసయ్యాడు. బలాదూర్‌గా తిరగడం, తల్లి, భార్య సంపాదనపై ఆధారపడి వచ్చిన డబ్బులు ఖర్చు చేస్తున్నాడు. ఆ మత్తులో తల్లి, భార్య బిడ్డలను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధిస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా.. అతని ప్రవర్తన లో మార్పు రావడం లేదు.

కన్న కొడుకుకు మరణ శాసనం రాసింది ఓ తల్లి..! కొడుకును కని పెంచి.. పెద్ద చేస్తే ప్రయోజకుడు అవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ పెళ్లి అయిన తర్వాత కొడుకు ప్రవర్తనలో మార్పు రాలేదు. బాధ్యతగా వ్యవహరిస్తూ తల్లి , భార్య పిల్లలను పోషించాలి. కానీ ఏ మాత్రం కుటుంబం పట్ల బాధ్యత లేకుండా.. మద్యానికి బానిసయ్యాడు. బలాదూర్‌గా తిరగడం, తల్లి, భార్య సంపాదనపై ఆధారపడి వచ్చిన డబ్బులు ఖర్చు చేస్తున్నాడు. ఆ మత్తులో తల్లి, భార్య బిడ్డలను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధిస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా.. అతని ప్రవర్తన లో మార్పు రావడం లేదు. వేధింపులు తట్టుకోలేక కన్న పేగు ప్రేమను అణచుకుని.. కొడుకుకు మరణ శాసనం రాసింది ఓ తల్లి..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం న్యూ గొల్లగూడెంలో దారుణం చోటుచేసుకుంది. రాజ్ కుమార్(40) అనే వ్యక్తి ఏ పనిచేయకుండా తాగుడుకు బానిసై నిత్యం తల్లిని, భార్యాబిడ్డలను చిత్రహింసలకు గురి చేశాడు. డబ్బులు ఇవ్వమని కొట్టడంతో విసిగి పోయారు. ఈ క్రమంలోనే మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లిని కొట్టడంతో తల్లి దూడమ్మ( 60) తట్టుకోలేకపోయింది. వేధింపులు భరించలేక మద్యం మత్తులో ఉన్న కొడుకు రాజకుమార్‌ను కాళ్ళను తాళ్లతో కట్టేసి ఉరి బిగించి హత్య చేసింది. ఇక తానే ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్థానికులకు తెలపడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన తల్లి దూడమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..