Southwest Monsoon: వానలొస్తున్నాయ్.. సోమవారం తెలంగాణలోకి రుతుపవనాల ఎంట్రీ..
Southwest Monsoon: సోమవారం తెలంగాణ నేలను తాకనున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. గోవా, కొంకణ్, కర్నాటక ప్రాంతాల్లో శనివారం నాటికి విస్తరించాయని తెలిపింది.
తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందింది. మరింత ఆలస్యం అనుకున్న వర్షాలు సోమవారం తెలంగాణ నేలను తాకనున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. గోవా, కొంకణ్, కర్నాటక ప్రాంతాల్లో శనివారం నాటికి విస్తరించాయని తెలిపింది. పశ్చిమ భారత తీర ప్రాంతాల్లో విస్తరించిన నేపథంలో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని అంచనా వేస్తున్నది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఎండలు దంచికొడుతున్నాయి.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో తొలకరి జల్లులు కురుస్తున్నాయ్. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్‌లో భారీ వర్షం కురిసింది. అలాగే, ఆదిలాబాద్ జిల్లాలో నేరడిగొండ, గుడి హత్నూరులో జోరు వానలు కురుస్తున్నాయి. ఇక, ఏపీలో కూడా తొలకరి వర్షాలు మొదలైపోయాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో పలుచోట్ల వానలు పడుతున్నాయి. తొలకరి వర్షాలతో పులికించిపోయింది పాడేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలకరి జల్లులు మొదలైపోవడంతో ఒకట్రెండు రోజుల్లోనే ఏపీ, తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.
40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఎండలు భారీగానే ఉన్నాయి. దీంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.