AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkeys Attack: పక్షవాతంతో ఉన్న వృద్ధురాలిపై కోతుల దాడి.. మంచంపైనే కన్నుమూత

Monkeys Attack: ఈ మధ్య కాలంలో వానరాలు మనుషులపై దాడికి తెగబడుతున్నాయి. ఒకప్పుడు అడవులకే పరిమితమైన వానరము ఇప్పుడు మనుషులు ఉండే పరిసర ప్రాంతాల్లోకి..

Monkeys Attack: పక్షవాతంతో ఉన్న వృద్ధురాలిపై కోతుల దాడి.. మంచంపైనే కన్నుమూత
Monkeys
Subhash Goud
|

Updated on: Sep 27, 2022 | 11:16 AM

Share

Monkeys Attack: ఈ మధ్య కాలంలో వానరాలు మనుషులపై దాడికి తెగబడుతున్నాయి. ఒకప్పుడు అడవులకే పరిమితమైన వానరము ఇప్పుడు మనుషులు ఉండే పరిసర ప్రాంతాల్లోకి వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కోతులతోనే దర్శనమిస్తాయి. ఇళ్లపై దూకుతు చెట్లు, ఇతర వస్తువులను పాడు చేస్తుంటాయి. అలాగే మనుషులపై కూడా దాడికి దిగుతున్నాయి. తాజాగా ఓ వృద్ధురాలిపై వానరమూక దాడికి దిగడంతో ఆ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం పాతసూర్యాపేట గ్రామంలో చోటు చేసుకుంది. బాధితు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మెట్టు లింగమ్మకు రెండు నెలల క్రితం పక్షవాతం సోకింది. కదలలేని స్థితిలో ఉన్న ఆమె కోసం కుమారుడు శంకర్‌రెడ్డి ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేశారు. శంకర్‌రెడ్డి దంపతులు పొలం పనులకు వెళ్లడంతో గదిలో ఒంటరిగా ఉన్న లింగమ్మపై అటుగా వచ్చిన కోతులు దాడి చేశాయి. ఆమె ముఖం, నడుము కాళ్లను ఇష్టరాజ్యంగా కరిచాయి. వీధి చివరన ఉండే వీరి ఇంట్లో వానరాల స్వైర విహారాన్ని గ్రామస్తులు గమనించలేపోయారు. దీంతో కోతుల దాడి కారణంగా తీవ్ర గాయాలతో ఉన్న ఆ వృద్ధురాలు మంచం మీదే ప్రాణాలు విడిచింది. అనంతరం వీరి ఇంటికి రోజూ మాదిరిగానే తాగునీటిని తీసుకెళ్లేందుకు వచ్చిన ఎస్సీ కాలనీ వాసులు చనిపోయిన లింగమ్మను గమనించి శంకర్‌ రెడ్డికి సమాచారం అందించారు.

కాగా, ఇలా కోతులు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుమిగూడుతున్నాయి. ఇంటి ఆవరణలో ఉన్న వస్తువులను ఎత్తుకెళ్లడం, గుంపులు గుంపులుగా ఇంట్లో చొరబడి దాడికి పాల్పడుతున్నాయి. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొతుల బెడదను తట్టుకోలేక డబ్బులు చెల్లించి కోతులను పట్టేవారిని పిలిపిస్తున్నారు. వారు వచ్చి గ్రామంలో ఉన్న వానరములన్నింటిని పట్టుకుని అడవుల్లో వదిలి పెట్టినా.. మళ్లీ తిరిగి వస్తుండటంతో కథ మొదటికొస్తుంది. ఇలా కోతుల వల్ల చాలా గ్రామాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. వాటిని తరిమికొట్టేందుకు గ్రామస్తులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం వినకపోవడంతో ఏం చేయాలో తెలియక గ్రామస్తులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో కోతులు గుంపులు గుంపులుగా చేరి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. రోడ్డు వెంట ఎవరైనా నడుచుకుంటూ వెళ్తున్నారంటే చాలు వారిని భయపెడుతూ దాడి చేసేందుకు యత్నిస్తు్‌న్నాయి. ఇంటి ఆవరణలో గానీ, ఇంటిపై గానీ ఏవైనా వస్తువులుంటే వాటిని నశనం చేయడమే వాటి పని. వాటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించినా.. తిరిగి ఎదురు దాడికి దిగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులను తమిరి కొట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం ఉండటం లేదని చెప్పుకుంటున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి