Gangster Nayeem Case: టాస్క్‌ఫోర్స్ అదుపులో గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న..
ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అదుపులో తీసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు శేషన్నను అరెస్ట్ చేశారు.
Gangster Nayeem follower Sheshanna : ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు శేషన్నను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు శేషన్న నుంచి 9 MM పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్న శేషన్న సోమవారం కొత్తపేట్ లోని ఒక హోటల్లో సెటిల్మెంట్ చేస్తున్న సమయంలో దాడులు చేశారు. పక్కా సమాచారంతో శేషన్నను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. కాగా.. శేషన్న అరెస్టును మంగళవారం చూపించనున్నారు. నాంపల్లి కోర్టులో అతన్ని హాజరుపర్చి రిమాండ్‌కు తరలించనున్నారు. కాగా.. గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ తర్వాత.. అతని ప్రధాన అనుచరుడు శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటినుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. కాగా.. అతని దగ్గర 9ఎంఎం పిస్టల్ దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల దగ్గర ఉండే పిస్టల్ ఆయన దగ్గరకు ఎలా వెళ్లింది.. ఇప్పటివరకు ఆయన నిర్వహించిన సెటిల్మెంట్‌లు, ఆయనకు ఆశ్రయం కల్పించింది ఎవరు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా నయిమ్ ఆస్థులు, డంప్‌లకు సంబంధించి కూడా శేషన్నకు పూర్తిగా తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్‌కౌంటర్ సమయంలో నయీం దగ్గర దొరికిన ఏకే–47తో పాటు అతడి డెన్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాలకు సంబంధించి కూడా శేషన్న నుంచి పలు వివరాలు సేకరించనున్నారు.
నయిమ్ ఎన్‌కౌంటర్..
2016 ఆగస్టు 8న షాద్‌నగర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో నయూం మృతిచెందాడు. అనంతరం నార్సింగిలోని నయీం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా భారీగా ఆస్తులు వెలుగు చూశాయి. నయీం ఎన్‌కౌంటర్ కేసును ప్రభుత్వం.. సిట్‌కు అప్పగించింది ప్రభుత్వం. దర్యాప్తులో అతని బినామీల పేరు మీద ఉన్న ఆస్తులను కొన్నింటిని సిట్ గుర్తించింది. అయితే.. పలువురు బాధితులు సైతం నయీం తమ ఆస్తులను లాక్కున్నట్లు ఫిర్యాదు చేశారు. నయీం బినామీల పేరు మీద ఉన్న ఆస్తుల పత్రాలను సిట్ కోర్టులోనూ సమర్పించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పలు ఆస్తులను విక్రయించేందుకు నయీం భార్య పహీమ్ బేగం, అనుచరులు పాశం శ్రీను, అబ్దుల్ ఫహీమ్, నజీర్‌లు ప్రయత్నించడంతో రాచకొండ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మొత్తం రూ. 150 కోట్లకు పైగా ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..