Hyderabad: రూ.లక్షల్లో జీతం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమంటూ లెటర్లు పంపాడు.. రూ.కోట్లు వసూలు చేశాడు.. కట్ చేస్తే..

IT Company fraud in madhapur: హైదరాబాద్‌లో భారీ ఫ్రాడ్‌ జరిగింది. సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌ (software jobs) పేరుతో సాఫ్ట్‌గా దోచేశాడు ఓ చీటర్‌. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరుతో సాఫ్ట్‌గా మోసం చేసిన ఓ కేటుగాడు కోట్ల రూపాయలు దండుకున్నాడు.

Hyderabad: రూ.లక్షల్లో జీతం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమంటూ లెటర్లు పంపాడు.. రూ.కోట్లు వసూలు చేశాడు.. కట్ చేస్తే..
It Company Fraud
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 27, 2022 | 5:22 AM

IT Company fraud in Madhapur: హైదరాబాద్‌లో భారీ ఫ్రాడ్‌ జరిగింది. సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌ (software jobs) పేరుతో సాఫ్ట్‌గా దోచేశాడు ఓ చీటర్‌. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరుతో సాఫ్ట్‌గా మోసం చేసిన ఓ కేటుగాడు కోట్ల రూపాయలు దండుకున్నాడు. డన్యోన్‌ ఐటీ టెక్నాలజీ అంటూ మాదాపూర్‌లో ఆఫీస్‌ తెరిచి అడ్డంగా దోచేశాడు. నిరుద్యోగులను బోల్తా కొట్టించడానికి సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్స్‌నే వాడుకున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్స్‌ కావాలంటూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో ప్రకటనలిచ్చిన డన్యోన్‌ ఐటీ టెక్నాలజీ నిర్వాహకుడు ప్రతాప్‌, యాన్యువల్ స్టార్టింగ్‌ ప్యాకేజీ నాలుగు లక్షల రూపాయలంటూ ఊరించాడు. ప్రతాప్‌ ప్రకటనలకు టెంప్టైన అన్‌ఎంప్లాయిస్‌.. ఉద్యోగాల కోసం క్యూకట్టారు. టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూస్‌ నిర్వహించి ఆ తర్వాత ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ ఇచ్చాడు ప్రతాప్‌. ఆ తర్వాతే అసలు కథ మొదలుపెట్టాడు. ప్లేస్‌మెంట్‌ కోసం ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేశాడు. అనంతరం, జాబ్‌ ఆఫర్ లెటర్స్‌ పంపాడు.

అయితే, ఎన్ని రోజులైనా ఆఫీస్‌ నుంచి పిలుపు రాకపోవడంతో అసలు మోసం బయటపడింది. ప్రాజెక్ట్‌ ఇస్తామంటూ నమ్మబలుకుతూ కాలయాపన చేయడంతో మోసపోయామని గ్రహించి, బాధితులంతా డన్యోన్‌ ఐటీ టెక్నాలజీ ఆఫీస్‌ను ముట్టడించారు. పారిపోయేందుకు ప్రయత్నించిన మోసగాడు ప్రతాప్‌ను పట్టుకుని మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు బాధితులు. విక్టిమ్స్‌ కంప్లైంట్స్‌తో కేసు నమోదు చేసుకున్న మాదాపూర్‌ పోలీసులు, చీటర్‌ ప్రతాప్‌ను అదుపులోకి తీసుకున్నారు.

బాధితులు వందమందికి పైగా ఉండటం, ఒక్కొక్కరి నుంచి రెండు లక్షల వరకు వసూలు చేయడంతో, కోట్ల రూపాయల మేర ఫ్రాడ్‌ జరిగినట్లు చెబుతున్నారు పోలీసులు. ఐటీ కొలువు వచ్చిందని, ఇక లైఫ్‌లో సెటిల్‌ అవుదామనుకున్న నిరుద్యోగులు.. డన్యోన్‌ ఐటీ కంపెనీ మోసంతో రోడ్డునపడ్డారు. తమ డబ్బు తమకు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు పోలీసులను వేడుకున్నారు. అయితే ఇంకా చాలామంది బాధితులు ఉన్నారని పోలీసులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలని.. వాటి గురించి పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వెళ్లాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. కాగా.. నగరంలో ఇలాంటి దందాలు చాలానే జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలంటూ పలువురు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..