Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Rains: కుండపోత వర్షంతో తడిసి ముద్దైన భాగ్యనగరం.. మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

హైదరాబాద్ నగరంలో కేవలం గంట వ్యవధిలో సుమారు 5సెంటిమిటర్ల వర్షపాతం నమోదయ్యింది. అయితే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాసులు  అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Hyderabad Rains: కుండపోత వర్షంతో తడిసి ముద్దైన భాగ్యనగరం.. మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Telangana Rain Alert
Follow us
Surya Kala

|

Updated on: Sep 27, 2022 | 6:46 AM

Hyderabad Rains: సోమవారం సాయంత్రం నుంచి కురిసిన కుండపోత వర్షంతో హైదరాబాద్ నగరం మరోసారి అతలాకుతలం అయింది. దాదాపు రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదు కావడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జంట నగరవాసులు మరోసారి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కు బిక్కు మని రాత్రిని గడిపారు. కొద్దిరోజులుగా ఎడతెరిపి ఇచ్చిన వర్షం సోమవారం సాయంత్రం నుంచి తన ప్రతాపం మరోసారి చూపించింది. కేవలం గంట వ్యవధిలో సుమారు 5సెంటిమిటర్ల వర్షపాతం నమోదయ్యింది. అయితే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాసులు  అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు.

  1. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, దిలషుక్ నగర్, మలక్ పేట్, గచ్చిబౌలి రాయదుర్గ, షేక్పేట్, టోలిచౌకి,లంగర్ హౌస్, అసిఫ్ నగర్ అమీర్పేట్,పంజాగుట్ట పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం ఆతలాకుతలం చేసింది. సరిగ్గా సాయంత్రం కురవడంతో ఉద్యోగ పనివేళలు ముగించుకుని వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురియ్యారు. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఒక్కసారిగా భారీ వర్షం రావడం రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధానంగా జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పంజాగుట్ట ఖైరతాబాద్ మెహిదీపట్నం లాంటి బిజీ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
  2. వర్షపాతం: ప్రపంచ మహనగరాలలో 41వ ప్లేస్ లో ఉన్న హైదరాబాద్‌.. దేశంలోనే రెండవ పెద్ద మెట్రోపాలిటన్ సిటీ.. 1908లో మూసీ నదికి వరదలు, అప్పుడు ఒక్కరోజే 43 సెం.మీ. వర్షం కురిసింది. 1916లో ఒక్క ఏడాదిలో 160 సెం.మీ. వర్షం పాతం నమోదు కాగా.. 2020లో 120 సెం.మీ వర్షం నమోదయింది. హైదరాబాదులో ప్రతి ఏడాది సగటున 78 సెం.మీ వర్షం కురుస్తుంది. 2020లో మరో రికార్డు, ఒక్క రోజే 32 సెంటీమీటర్ల వర్షం కురవగా.. 2021 జూలై14న ఉప్పల్ బండ్లగూడలో 21.2 సెం.మీ వర్షం నమోదు అయింది.
  3. పెరిగిన నగర విస్తీర్ణం, తగ్గిన అడవులు: కాలక్రమంలో భాగ్యనగర నగర విస్తీర్ణం పెరిగింది. 55 స్క్వేర్‌ మీటర్ల పరిధి నుంచి 625 స్క్వేర్‌ మీటర్లు హైదరాబాద్‌ నగర విస్తీర్ణం పెరిగింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పేరేషన్‌గా మార్పు చెందింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌ మెంట్ అధార్టీ పేరుతో  శివారు ప్రాంతాలు కలిశాయి. దీంతో హైదరాబాద్‌ నగరం 7,257 స్క్వేర్‌ మీటర్ల విస్తీర్ణానికి  చేరుకుంది. 2017 లెక్కల ప్రకారం జీహెచ్‌ఎంసీ,హెచ్‌ఎండీ పరిధిలో 2,800 వేల చెరువులు ఉన్నాయి.  పెరిగిన కాంక్రీటైజేషన్ తో అడవులు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు నగర శివారులో అడవులు, కొండలు, గుట్టలతో నిండి ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్ లో కేవలం 8.61 శాతం మేరకే అడవుల విస్తీర్ణం ఉండటం చాలా ఆశ్చర్యం కలిగించే అంశం…
  4. డ్రైనేజీ వ్యవస్ధ: 1908లో హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల సమయంలో వరద నీరు ఎక్కడా ఇళ్లల్లోకి రాలేదని కొందరు పెద్దలు చెబుతారు. కురిసిన వర్షం నీరు కాలువలు ద్వారా చెరువులోకి వెళ్ళిపోయింది. అయితే 1956లో నుంచి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఏర్పడిన అనంతరం.. నగరానికి భారీగా  వలసలు పెరిగాయి. గత 50 ఏళ్ళతో పోల్చుకుంటే నగర జనాభా, నగర విస్తీర్ణం భారీగా పెరిగాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 70 లక్షలు ఉండగా.. తాజాగా 1 కోటి 20 లక్షలకు చేరుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
  5. ఇవి కూడా చదవండి
  6.  ఆక్రమణకు గురైన నాలాలు: జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్ధ నిర్మాణం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి 5,000 కిలోమీటర్ల నాలాలు, కాలువలు అవసరం ఉండగా.. ప్రస్తుతం కేవలం 1500 కిలోమీటర్ల మేర మాత్రమే నాలాలు ఉన్నాయి. ప్రస్తుతం 25 ఎస్టిపిల ద్వారా 772 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేసి.. ఆ తర్వాత మూసి నదిలోకి వదులుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా పలుచోట్ల కాలువలు పూడి పోవటంతో రోడ్లు పై  వర్షపు నీరు నిలిచిపోతుంది. కొన్నిప్రాంతాలలో 10 ఫీట్ల వరకు నిలిచి పోతూ నదులను తలిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీశైల క్షేత్రంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం!
శ్రీశైల క్షేత్రంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం!
బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా
బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా
రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ నుంచి జారి రైలు కిందపడ్డ కుక్క..
రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ నుంచి జారి రైలు కిందపడ్డ కుక్క..
ఐశ్వర్యరాయ్‌ బాడీగార్డ్‌ జీతమెంతో తెలుసా ??
ఐశ్వర్యరాయ్‌ బాడీగార్డ్‌ జీతమెంతో తెలుసా ??
వంటింట్లోకి వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్‌.. అక్కడ సీన్‌ చూసి..
వంటింట్లోకి వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్‌.. అక్కడ సీన్‌ చూసి..
నిజమవుతున్న బాబా వంగా కాలజ్ఞానం.. యుగాంతం మొదలైందా..?
నిజమవుతున్న బాబా వంగా కాలజ్ఞానం.. యుగాంతం మొదలైందా..?
శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అనా కొణిదెల
శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అనా కొణిదెల
నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.