Watch Video: ఏంటి మావా ఇది.. నీకు మరో ప్లేస్ దొరకలేదా.. ఉద్యోగి భుజాలపై ఎక్కి మరీ.. ఏం చేసిందంటే..
మనుషులు కనిపిస్తే చాలు కొన్ని కోతులు.. మీద పడి కరిచేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడో కోతి మాత్రం ప్రభుత్వ కళాశాల కార్యాలయంలోకి చొరబడి ఓ ఉద్యోగి బుజాలపైకి ఎక్కి కూర్చుని.. దాదాపు గంటకు పైగా అతనిపై తలపై పడుకుంది.. ఏ జన్మ బంధమో ఏమో కానీ ఆ కోతిని తరిమేసే ప్రయత్నం చేసినా.. అక్కడి నుండి వెళ్లకుండా అతని తలపైనే పడుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.. ఈ వింత ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో వెలుగు చూసింది.

ప్రభుత్వ కార్యాలయంలోకి దూరికన ఒక కోతి.. టేబుల్‌పై కూర్చొన్న ఉద్యోగి దగ్గరకు వెళ్లి ఎంచక్క అతని భుజాలపై ఎక్కి నిద్రపోయిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో జరిగింది. సాదిక్ అనే ఉద్యోగి ప్రిన్సిపాల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.. సరిగ్గా అదే టైంలో వానరం హఠాత్తుగా ఆ గదిలోకి చొరబడింది.. సిబ్బంది అంతా ఆ కోతిని తరిమేసే ప్రయత్నాలు చేశారు.. కానీ అది మాత్రం అక్కడున్న ఎంచక్క సాదిక్ భుజాల పైకి ఎక్కి.. అతని తలపైకి హాయిగా కునుకుతీసింది.
దాదాపు గంటకు పైగా అలా వానరం ఆయన తల పైన పడుకోవడం చూసి అంతా ఆశ్చర్య పోయారు.. అయితే మొదట వానరం ఉద్యోగిపై దాడి చేసి గాయపరుస్తుందేమోనని భయపడ్డ వారంతా అతనిపై ఈ వానరం చూపిన ప్రేమను చూసి ఆశ్చర్య పోయారు.. అతని తలపై కొంత సేపు పడుకొని తలను నిమురుతూ బిడ్డ ప్రేమను ప్రదర్శించిన ఆ వానరం కొంతసేపటీ తర్వాత అక్కడ నుండి వెళ్లిపోయింది.
ఈ విచిత్ర సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. తమ సెల్‌ఫోన్‌లలో ఆ దృశ్యాలను బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ కోతికి ఆయన ఫ్రూట్స్, ఆహారం తినిపించే ప్రయత్నం చేసినా ఏమి తీసుకోలేదు.. ఆయన భుజాలపై ఎక్కి తలపై పడుకొని కాసేపు తలను నిమురుతూ చూపరులను ఆశ్చర్య పరిచింది.. చివరకు తనంతటగానే భుజాలపై నుండి దిగి వెళ్ళిపోయింది.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
