MLC Kavita: ‘దళితులను అవమానించడం సీఎం రేవంత్‌కు అలవాటే’.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు..
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేద ఆశీర్వచన సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కింద కూర్చున్నారనే విషయం వివాదంగా మారుతోంది. ఇప్పుడు ఈ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. యాదాద్రి పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కొండ సురేఖలను అవమానించినందుకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. యాదాద్రి పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేద ఆశీర్వచన సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కింద కూర్చున్నారనే విషయం వివాదంగా మారుతోంది. ఇప్పుడు ఈ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. యాదాద్రి పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కొండ సురేఖలను అవమానించినందుకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. యాదాద్రి పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సీఎం దంపతులతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ ఉన్నారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేవంత్ రెడ్డి, సతీమణి గీత దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు తర్వాత సీఎం రేవంత్‌తో పాటు మంత్రులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ ఆశీర్వచనం ఇచ్చే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోమటిరెడ్డిలు ఎత్తుగా ఉన్న పీటలపై కూర్చోవడం, పక్కనే ఎత్తు తక్కువగా ఉన్న పీటలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ కూర్చున్నారు. సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా దళిత సామాజిక వర్గానికి చెందిన భట్టిని.. రేవంత్ అవమానించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అగ్రవర్ణాలకు చెందిన రేవంత్, మంత్రులు ఎక్కువ ఎత్తులో కూర్చొని, భట్టి, కొండా సురేఖలను తక్కువ ఎత్తులో కూర్చోబెట్టడం దౌర్భాగ్యమని ఆమె అన్నారు. దళితులను అవమానించడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటేనని ఆమె విమర్శించారు. అయితే ఈ ఘటనపై యాదాద్రి దేవస్థానం ఈవో రామకృష్ణారావు వివరణ ఇచ్చారు. ఆలయంలో ఎవరిని కూడా అవమానించలేదని ఎవరికీ ఎలాంటి లోటుపాట్లు జరగలేదని ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులకు కూడా వేద ఆశీర్వచన సమయంలో పీటలు వేసామని ఆయన చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




