AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దర్గా బాబా సలహాతో తాయత్తు కట్టుకునేందుకు సిద్దం.. నదిలో మునిగిన వెంటనే..

మూఢనమ్మకం అక్కా, తమ్ముడు ప్రాణాలను బలితీసుకుంది. ఆరోగ్యం బాగాలేదని దర్గా బాబా దగ్గరికి వెళితే నదిలో మునిగి తాయెత్తులు కట్టుకోమని సలహా ఇచ్చాడు. బాబా చెప్పిన సలహా మేరకు వెళ్లే దారిలో నదిలో మునిగిన అక్కా, తమ్ముడు అనంతలోకాలకు వెళ్లిపోయారు. నంద్యాల జిల్లా, చాగలమర్రి టౌన్‎కు చెందిన షేక్ ఖాజా హుస్సేన్, అతని భార్య షేక్ ఇమామ్ బీ, బావమరిది అయిన ఫకీర్ మస్తాన్‎లు ముగ్గురు కలిసి షేక్ ఇమాంబి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కడప జిల్లాలోని ఎర్రగుంట్ల దర్గా వద్ద పూజలు చేయించుకుని తాయిత్తులు తీసుకున్నారు.

దర్గా బాబా సలహాతో తాయత్తు కట్టుకునేందుకు సిద్దం.. నదిలో మునిగిన వెంటనే..
Kadapa
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Mar 10, 2024 | 10:24 PM

Share

మూఢనమ్మకం అక్కా, తమ్ముడు ప్రాణాలను బలితీసుకుంది. ఆరోగ్యం బాగాలేదని దర్గా బాబా దగ్గరికి వెళితే నదిలో మునిగి తాయెత్తులు కట్టుకోమని సలహా ఇచ్చాడు. బాబా చెప్పిన సలహా మేరకు వెళ్లే దారిలో నదిలో మునిగిన అక్కా, తమ్ముడు అనంతలోకాలకు వెళ్లిపోయారు. నంద్యాల జిల్లా, చాగలమర్రి టౌన్‎కు చెందిన షేక్ ఖాజా హుస్సేన్, అతని భార్య షేక్ ఇమామ్ బీ, బావమరిది అయిన ఫకీర్ మస్తాన్‎లు ముగ్గురు కలిసి షేక్ ఇమాంబి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కడప జిల్లాలోని ఎర్రగుంట్ల దర్గా వద్ద పూజలు చేయించుకుని తాయిత్తులు తీసుకున్నారు. అలానే తాయత్తులను ఏదైనా నదిలో మునిగి కట్టుకుంటే మంచిదని దర్గాలో బాబా చెప్పాడు. ఆయన మాటప్రకారం తిరిగి చాగలమర్రికి పోతూ రాజుపాలెం మండలం కూలూరు గ్రామం వద్ద కుందునదిలో మునిగి చాగలమరికి పోదామని షేక్ ఇమాంబి చెప్పగా కుందునది వద్దకు ముగ్గురు వెళ్ళారని ఇంమాంబి భర్త పోలీసులకు తెలిపారు.

అయితే షేక్ ఖాజా హుస్సేన్ కుందునది కట్టపై ఉండగా ఆయన భార్య అయినా షేక్ ఇమాంబి( 27) ఆమె తమ్ముడు ఫకీర మస్తాన్ (26 ) నీటి వద్దకు వెళ్లి అందులో మునగగా ప్రమాదవశాత్తు కుందునది లోతులో మునిగి ఊపిరాడక చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. వారు నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయారని నీటి ఒడ్డునే ఎక్కువ లోతు ఉండడం దీనికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఇసుక తవ్వకం వల్లే గుంటలు పడి వీళ్లు మునిగిపోయినట్లు చెబుతున్నారు. అక్క, తమ్ముడు నీటిలో మునిగిపోవడంతో సమీపంలోని కొందరు ఈతగాళ్ళను పీలిచి మునిగిపోయిన అన్నా, చెల్లెలు మృతదేహాలను బయటికి తీశారు. అయితే అప్పటికే వారు మృతి చెంది ఉండడంతో జరిగిన సంఘటనపై ఖాజా హుస్సేన్ ఫిర్యాదు మేరకు రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా మూఢనమ్మకం మరో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి మూఢనమ్మకాలను పక్కన పెట్టాలని ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌