- Telugu News Photo Gallery Political photos PM Modi laid the foundation stone on virtual for the construction of the new terminal at Kadapa Airport.
కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ.. న్యూ టెర్మినల్ భవనానికి పీఎం మోడీ శంకుస్థాపన..
కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ పట్టింది. మధ్యాహ్నం వరకు మాత్రమే విమానయాన సేవలను అందించిన కడప ఎయిర్ పోర్ట్ ఇకనుంచి రాత్రి పూట కూడా విమానయాన సర్వీసులను అందించనుంది. అందుకుగాను ఇప్పటికే రన్వేను పెంచడం దానికి సంబంధించి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసి రైతులందరికీ నష్టపరిహారం కూడా చెల్లించడం జరిగింది.
Sudhir Chappidi | Edited By: Srikar T
Updated on: Mar 10, 2024 | 6:50 PM

కడప విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవన శంకుస్థాపన కార్యక్రమాన్ని పీఎం మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కడపలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా , రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ హాజరయ్యారు. కొత్త భవనాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఏవియేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ పట్టింది. మధ్యాహ్నం వరకు మాత్రమే విమానయాన సేవలను అందించిన కడప ఎయిర్ పోర్ట్ ఇకనుంచి రాత్రి పూట కూడా విమానయాన సర్వీసులను అందించనుంది. అందుకుగాను ఇప్పటికే రన్వేను పెంచడం దానికి సంబంధించి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసి రైతులందరికీ నష్టపరిహారం కూడా చెల్లించడం జరిగింది.

అయితే ఇప్పుడు టెర్మినల్ చిన్నదిగా ఉండడంతో దేశంలోని చాలా విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో కడప ఎయిర్ పోర్ట్‌ను కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తొమ్మిది వేల కోట్లలో 300 కోట్లు కడప ఎయిర్ పోర్ట్‌కు వెచ్చించనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.

అందులో భాగంగానే వర్చువల్‌గా కడప విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.16 వేల పైచిలుకు చదరపు మీటర్ల విస్తీర్ణంలో దాదాపు రూ. 2,005 కోట్ల రూపాయలతో కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అందుకుగాను దాదాపు 24 కొత్త చెకింగ్ పాయింట్లు ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని విధాలుగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ఉండే విధంగా టెర్మినల్స్‌ను మార్చనున్నారు.

దానికి సంబంధించి ఇప్పటికే నిధులు కూడా కేటాయించినట్లు ప్రధాని తెలిపారు. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం అనంతరం వెంటనే పనులు ప్రారంభించి ప్రజలకు అత్యంత చేరువుగా ఈ టెర్మినల్ భవనాన్ని తీసుకురానున్నట్లు కూడా ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ కడప విమానాశ్రయం అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించామని, రాత్రి పూట విమానాలు ల్యాండ్ అవడానికి రన్ వే కు భూసేకరణ చేశామన్నారు.

కడప విమానాశ్రయం నుంచి విజయవాడ, చెన్నై, బెంగళూరుకు సర్వీసులు వెళుతున్నాయని.. ఇకనుంచి మరింత అభివృద్ధి చేసి రాత్రి సమయంలో కూడా ప్రయాణాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. అందుకుగాను ఏవియేషన్ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు





























