AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రశాంతంగా ఉన్న ఆ ఎమ్మెల్యేకు కోపం తన్నుకొచ్చింది.. ఇంతకీ ఆమె ఆగ్రహానికి కారణమేంటో తెలుసా?

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్.. కవ్వాల్ టైగర్ జోన్ రీలోకేషన్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు..

Telangana: ప్రశాంతంగా ఉన్న ఆ ఎమ్మెల్యేకు కోపం తన్నుకొచ్చింది.. ఇంతకీ ఆమె ఆగ్రహానికి కారణమేంటో తెలుసా?
Mla Rekha Naik
Shiva Prajapati
|

Updated on: Oct 21, 2022 | 10:11 PM

Share

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్.. కవ్వాల్ టైగర్ జోన్ రీలోకేషన్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు.. నియోజకవర్గంలోని అధికారులందరూ హాజరయ్యారు. లబ్దిదారులు, స్థానిక ప్రజానీకం కూడా హాజరయ్యారు. కొత్తమద్దిగడపలో ఈ కార్యక్రమం సజావుగా సాగుతున్న క్రమంలో అక్కడున్న మహిళల్లో కొంత మంది ఒక్కసారిగా నిరసనకు దిగారు. పునరావాసం కింద తమ భూమిని ఇవ్వడానికి వీల్లేదన్నారు.

తమకు న్యాయం జరగలేదంటూ కొత్తమద్దిపడగ మహిళలు ఆందోళనకు దిగారు. అధికారులు, ప్రజాప్రతినిధులను పట్టుకుని నిలదీశారు. అందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా.. మహిళలు వాదనకు దిగారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే రేఖా నాయక్. వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే అంటే ఒక కులానికి, ఒక గ్రామానికి కాదు. మొత్తం నియోజకవర్గానికి అంటూ ఫైర్ అయ్యారు. భూమికి సంబంధించిన సరైన పత్రాలు ఉంటే.. అటవీశాఖ అధికారులకు చూపించి.. న్యాయంగా కొట్లాడాలన్నారు. చట్టపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఎవరో చెపితే ఆందోళన చేయడం సరికాదన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధుల పట్ల ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదన్నారు ఎమ్మెల్యే రేఖానాయక్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..