పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్.. స్కూల్లోకి చొరబడి అందరినీ చితకబాదాడు.. ఎక్కడంటే..

ఒక్కసారిగా హడలెత్తిపోయిన విద్యార్థులు, ఉపాద్యాయులు.. ఒక్కసారిగా స్కూల్లోకి పరుగులు తీశారు. పిల్లల అరుపులు విని అక్కడికి చేరుకున్న స్థానికులు.. 

పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్.. స్కూల్లోకి చొరబడి అందరినీ చితకబాదాడు.. ఎక్కడంటే..
Ap Crime News
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 21, 2022 | 9:56 PM

మహబూబాబాద్ జిల్లాలో సైకో హల్చల్ చేశాడు. గూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలోకి గుర్తుతెలియని వ్యక్తి స్కూల్ లోకి చొరబడ్డాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులపై విచక్షణ రహితంగా దాడి చేసి.. తీవ్రంగా గాయపర్చాడు. మాసిన గడ్డం, మురికి బట్టలు వేసుకున్న ఆ అవతారం చూస్తేనే అర్ధమవుతుంది అతనికి మతిస్థితమితం సరిగా లేదని. ఇతను ఎక్కడుంటాడో తెలియదు. కానీ గూడూరు స్కూల్ దగ్గర ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. గేటు దగ్గర ఉన్న పిల్లలను చితకబాదాడు. ఆ పక్కనే ఉన్న ఉపాధ్యాయురాలిపైనా దాడి చేశాడు. ఆమె మెడలో గొలుసు లాగబోయాడు.

ఒక్కసారిగా హడలెత్తిపోయిన విద్యార్థులు, ఉపాద్యాయులు.. ఒక్కసారిగా స్కూల్లోకి పరుగులు తీశారు. పిల్లల అరుపులు విని అక్కడికి చేరుకున్న స్థానికులు..  పారిపోతున్న సైకోను పట్టుకున్నారు. అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి