Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్య చిట్కాలు: డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవడానికి ఈ డైట్ పాటించండి..

ప్రమాదకరమైన వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ప్రాణాలను తీసే శక్తి ఉన్న డెంగ్యూ వ్యాధి రోగుల శరీరాన్ని బలహీనపరుస్తుంది. దాని నుంచి కోలుకోవడం అనుకున్నంత సులువు కాదు. డెంగ్యూ రోగి త్వరగా కోలుకోవడానికి మీ ఆహారాన్ని మార్చుకోవాలి.

ఆరోగ్య చిట్కాలు: డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవడానికి ఈ డైట్ పాటించండి..
Dengue Fever
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 21, 2022 | 8:37 PM

ఆరోగ్య చిట్కాలు:  చలికాలం ప్రారంభం కాబోతుంది. అయితే ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. వాతావరణం పూర్తి భిన్నంగా మారిపోయింది. దీని వల్ల అందరి ఆరోగ్యం దెబ్బతింటోంది. వాతావరణ మార్పుల కారణంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. డెంగ్యూ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. శరీరం శక్తిని కోల్పోతుంది. ఆయాసం రోగులను వేధిస్తుంది. డెంగ్యూ సమయంలో శరీరం బలహీనంగా మారుతుంది. ఇది ఆహారం లోపలికి రాకుండా చేస్తుంది. ఆహారం శరీరంలోకి ప్రవేశించకపోతే, పోషకాల కొరతతో బాధపడటం సాధారణం. డెంగ్యూ బారిన పడి కోలుకుంటున్న వారు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలన్నారు. డెంగ్యూ వ్యాధిగ్రస్తుల ఆహారం ఎలా ఉండాలో నిపుణుల సూచన మేరకు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆహారంలో ద్రవపదార్థం: శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకూడదు. శరీరానికి సరిపడా లిక్విడ్ డైట్ చేర్చుకోవాలి. కాబట్టి ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. డెంగ్యూ వ్యాధి నుంచి కోలుకుంటున్న వారు ఎక్కువగా నీళ్లు తాగాలి. కషాయాలు, హెర్బల్ టీలు, సూప్‌లను నీటితో కలిపి తాగితే మంచిది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడంలో కూడా సహాయపడుతుంది. డెంగ్యూ చికిత్స తర్వాత ప్లేట్‌లెట్లను పెంచడానికి హైడ్రేషన్‌పై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.

ఆహారంలో మసాలాలు : ఆహారంలో ఉపయోగించే మసాలాలు ఔషధాల రూపంలో పనిచేస్తాయని చాలా మందికి తెలుసు. ఇది చాలా వరకు కోలుకోవడానికి సహాయపడుతుంది. పసుపు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, యాలకులు మరియు జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక మసాలాలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. డెంగ్యూ నుండి కోలుకోవడానికి మీరు ఈ మసాలా దినుసులను డికాక్షన్ లేదా ఆహారం రూపంలో తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆహారంలో ప్రోబయోటిక్స్ చేర్చండి : డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవాలనుకునే వారు ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాకు గొప్ప మూలం. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీరు అరటిపండ్లు, సోయాబీన్స్, వెల్లుల్లి, ఉల్లిపాయలు తృణధాన్యాలను తీసుకుంటే.. ప్రోబయోటిక్స్ అధికంగా పొందుతారు. డెంగ్యూ కారణంగా శరీరం బలహీనంగా ఉండి, మంచంపై నుంచి లేవడం కష్టంగా ఉన్నవారు ఈ ఆహారపదార్థాలు తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడేందుకు దోహదపడుతుంది.

శరీరానికి విటమిన్లు-యాంటీఆక్సిడెంట్లు అవసరం: డెంగ్యూ సమయంలో శరీరంలో సూక్ష్మపోషకాలు గణనీయంగా తక్కువగా ఉంటాయి. కాబట్టి డెంగ్యూ నుండి కోలుకున్న వ్యక్తి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. మీరు మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, సీజనల్ పండ్లను చేర్చుకుంటే, మీరు త్వరగా ఫలితాలను చూస్తారు. యాపిల్ పండు, దానిమ్మ పండు, బొప్పాయి వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పీచుపదార్థాలను అందించే పండ్లు, ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీరు త్వరగా కోలుకుంటారు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి