Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో.. ఆ ఆపార్ట్‌మెంట్‌ సొసైటీలో నివాసితులు, సెక్యూరిటీ గార్డుల మధ్య ఘర్షణ.. సిగలు పట్టుకుని కొట్టుకున్న వీడియో వైరల్‌..

వీడియోలో కొంతమంది వ్యక్తులు గొడవపడుతుండగా, సెక్యూరిటీ గార్డులు వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. నిరసన తెలుపుతున్న మహిళలు ఒక మహిళా గార్డును జుట్టు పట్టి లాగడం కూడా వీడియోలో కనిపించింది.

ఓరీ దేవుడో.. ఆ ఆపార్ట్‌మెంట్‌ సొసైటీలో నివాసితులు, సెక్యూరిటీ గార్డుల మధ్య ఘర్షణ.. సిగలు పట్టుకుని కొట్టుకున్న వీడియో వైరల్‌..
Noida Society
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 21, 2022 | 7:22 PM

నోయిడాలోని హైడ్ పార్క్ రెసిడెన్షియల్ సొసైటీలో అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి వేర్వేరు అభ్యర్థులకు మద్దతు ఇస్తున్న రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో, కొంతమంది వ్యక్తులు పోరాడుతుండగా, గార్డులు వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. వైరల్ వీడియోలో కొంతమంది వ్యక్తులు గొడవపడుతుండగా, సెక్యూరిటీ గార్డులు వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. నిరసన తెలుపుతున్న మహిళలు ఒక మహిళా గార్డును జుట్టు పట్టి లాగడం కూడా వీడియోలో కనిపించింది. మరోవైపుగా సెక్యూరిటీ గార్డులు కూడా లాఠీలతో పోరాడుతున్నారు. గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, AOA ప్రెసిడెంట్ పదవికి సంబంధించి పోలీస్ స్టేషన్ సెక్టార్-113 పరిధిలోని హైడ్ పార్క్ సొసైటీలో రెండు పార్టీల మధ్య వివాదం నడుస్తోందని, దీనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో నోయిడాలోని హౌసింగ్ సొసైటీకి చెందిన సెక్యూరిటీ గార్డు, జొమాటో డెలివరీ బాయ్ మధ్య గొడవ జరిగింది. హౌసింగ్ సొసైటీ సెక్యూరిటీ గార్డు డెలివరీ ఏజెంట్‌కు ప్రవేశం నిరాకరించడంతో గొడవ జరిగింది. ఐపీసీ సెక్షన్ 151 కింద వారిద్దరినీ యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

అంతకుముందు, రాజకీయ నాయకుడు శ్రీకాంత్ త్యాగి, గ్రాండ్ ఓమాక్స్ సొసైటీలోని మరొక నివాసి మధ్య గొడవ గత నెలలో పెద్ద రచ్చ సృష్టించింది. త్యాగి తన గ్రౌండ్ ఫ్లోర్ అపార్ట్‌మెంట్ ముందు బహిరంగ ప్రదేశంలో తాటి చెట్లను నాటుతున్నప్పుడు నిరసన తెలుపుతున్న మహిళను దుర్భాషలాడుతూ నెట్టివేస్తున్న వీడియో వైరల్ కావడంతో అతన్ని అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత త్యాగి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆగస్టు 9న మీరట్‌లో నోయిడా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిని పట్టుకునేందుకు పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. శ్రీకాంత్ త్యాగి కోసం ఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్ మూడు రాష్ట్రాల్లో వేట సాగించింది. చివరికి అతనిని మీరట్‌లో గుర్తించారు. అక్కడ పోలీసులు అతనిని, అతని ముగ్గురు సహచరులను అరెస్టు చేశారు. త్యాగిపై భారతీయ శిక్షాస్మృతిలోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి