Hate Speech Cases: విద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారిపై కేసులు పెట్టండి.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యూపీ , ఉత్తరాఖండ్ , ఢిల్లీ పోలీసులకు హేట్ స్పీచ్‌లపై నోటీసులు జారీ చేసింది

విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యల చేసే వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసులు నమోదు చేయడంలో జాప్యం చేస్తే అలాంటి పోలీసు అధికారులపై చర్యలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్ , ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో నమోదైన హేట్ స్పీచ్‌ల వివరాలు అందించాలని ఆదేశించింది. మతాలకు అతీతంగా.. ఈ తరహా ప్రసంగాలు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ల ధర్మాసనం దీనిని విచారించింది.
ఈ తరహా కేసుల్లో ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రంతోపాటు ఢిల్లీ , ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీస్ ఉన్నతాధికారుల నుంచి నివేదిక విద్వేషపూరిత నేరాలు, ప్రసంగాల ఘటనలపై స్వతంత్ర, విశ్వసనీయ, నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టేలా.. కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషనర్ కోరారు.
ఈ తరహా ఘటనలను అరికట్టేందుకు UAPA చట్టాన్ని ప్రయోగించాలని విజ్ఞప్తి చేశారు. ఇది 21వ శతాబ్దం. మతం పేరిట మనం ఎక్కడికి చేరుకున్నాం? లౌకిక దేశంలో ఈ పరిస్థితి రావడం దారుణం అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. . భారత రాజ్యాంగం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం గురించి చెబుతోందని , సెక్యులర్ దేశంలో హేట్ స్పీచ్‌లకు స్థానం లేదని స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం