Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మూన్ లైటింగ్ వివాదంపై క్లారిటీ.. కండీషన్స్ అప్లై..

ఇటీవల కాలంలో ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తూ.. మరో ఉద్యోగం చేస్తున్న వారిపై పలు ఐటీ కంపెనీలు చర్యలు తీసుకున్న విషయం తెలసిందే. ఇలా ఒక కంపెనీలో చేస్తూ మరో ఉద్యోగాన్ని చేయడాన్ని..

Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మూన్ లైటింగ్ వివాదంపై క్లారిటీ.. కండీషన్స్ అప్లై..
Infosys
Follow us

|

Updated on: Oct 21, 2022 | 10:43 PM

ఇటీవల కాలంలో ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తూ.. మరో ఉద్యోగం చేస్తున్న వారిపై పలు ఐటీ కంపెనీలు చర్యలు తీసుకున్న విషయం తెలసిందే. ఇలా ఒక కంపెనీలో చేస్తూ మరో ఉద్యోగాన్ని చేయడాన్ని గిగ్ జాబ్స్ అంటారు. అలాగే దీనినే మూన్ లైటింగ్ గా పిలుస్తారు. తమ సంస్థలో ఉద్యోగం చేసేవారు తమకు తెలియకుండా మరో ఉద్యోగం చేయడంపై ఇన్ఫోసిస్ సంస్థ ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా మూన్ లైటింగ్ చేసే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కూడా హెచ్చరించింది. అయితే మూన్ లైట్ వివాదంపై ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సంస్థ హెచ్ ఆర్ విభాగం మెయిల్ చేసింది. తమ సంస్థలో ఉద్యోగులు గిగ్ జాబ్స్ చేసుకోవచ్చని, కాని కొన్ని షరతులు వర్తిస్తాయని తెలిపింది. గిగ్ జాబ్స్ చేయాలనుకునే వారు ముందుగా సంస్థ అనుమతి తీసుకోవాలని, చేసే జాబ్ వివరాలు తెలియజేయాల్సి ఉంటుందని, ఇన్ఫోసిస్ జాబ్ టైమింగ్స్ కాకుండా మిగతా సమయాల్లోనే ఈ జాబ్ చేయాల్సి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

ఒక కంపెనీలో చేసే ఫుల్ టైమ్ జాబ్ తో పాటు చేసే పార్ట్ టైమ్ జాబ్, కాంట్రాక్ట్ లేదా ఆసక్తి ఉన్న రంగంలో చేసే చిన్న ఉద్యోగాలను గిగ్ జాబ్స్ అంటారు. ఈ విభాగంలోకి పార్ట్ టైమ్ డ్రైవింగ్, పెయింటింగ్, కోచింగ్, ట్యూటరింగ్, ఫిట్ నెస్ ట్రైనింగ్, ఫ్రీలాన్స్ వర్క్స్ మొదలైనవి వస్తాయి. అయితే మరికొన్నిషరతులను తమ ఇంటర్నల్ కమ్యూనికేషన్ లో ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు విధించింది. ఇన్ఫోసిస్, లేదా ఇన్ఫోసిస్ క్లయింట్ల పోటీ సంస్థల వద్ద ఈ గిగ్ జాబ్స్ చేయకూడదని స్పష్టం చేసింది.

ఈ గిగ్ జాబ్స్ వల్ల ఇన్ఫోసిస్ లో చేసే ప్రధాన ఉద్యోగ విధులపై ప్రభావం పడకూడదని పేర్కొంది. ఈ గిగ్ జాబ్స్ పరిధిలోకి ఏ జాబ్స్ వస్తాయో మ ఆత్రం ఇన్ఫోసిస్ పేర్కొనలేదు. మూన్ లైటింగ్ అనే పదాన్ని కూడా సంస్థ ఈ మెయిల్ లో ఉపయోగించలేదు. గిగ్ జాబ్స్ అని మాత్రమే పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.