Telangana: అసెంబ్లీ ఆవరణలో తుపాకుల కలకం.. చెట్ల పొద తొలగిస్తుండగా దొరికిన గన్స్..
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లోని జూబ్లీహాల్లో తుప్పుపట్టిన గన్స్ ప్రత్యక్షమయ్యాయి. చెట్ల పొదలన తొలగిస్తుందగా గన్స్ కనిపించాయి. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని..

హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లోని జూబ్లీహాల్లో తుప్పుపట్టిన గన్స్ ప్రత్యక్షమయ్యాయి. చెట్ల పొదలన తొలగిస్తుందగా గన్స్ కనిపించాయి. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని జూబ్లీహాల్ సమీపంలో మూడు తుపాకులు లభ్యమవడం కలకలం రేపుతుంది. అసెంబ్లీ ఆవరణలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు చెట్ల పొదలను తొలగిస్తుండగా బ్లూకలర్ కవర్‌లో మూడు గన్స్ కనిపించాయి. దీంతో ఒక్కసారిగా క్లీనింగ్ సిబ్బంది అవాక్కయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
చెట్ల పొదల్లోని కవర్లో ఉన్న మూడు తుపాకుల్లో ఒకటి తపంచ, రెండు కంట్రీ మేడ్ రివాల్వర్లగా గుర్తించారు పోలీసులు. క్లీనింగ్ సిబ్బంది సమాచారం మేరకు ఘటన స్థలాన్ని బాంబ్ స్క్వాడ్ చేత పరిశీలించారు. వెంటనే మూడు రివార్వర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. గన్స్ ఎవరు పడేశారు? ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి?. ఇలాంటి గన్స్ ఎవరు ఉపయోగించేవారు? అసలు ఇక్కడకు ఎలా వచ్చాయి? ఎవరైనా పడేశారా? అనే కోణంలో ధర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు సైఫాబాద్ పోలీసులు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..