Munugode Bypoll: పార్టీ మారేదే లేదు, బండి సంజయ్‌ని సీఎం చేస్తా.. జితేందర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ కమలం పార్టీకి చెందిన నాయకులను ఆకర్షించే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసిన శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ తిరిగి టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్..

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ కమలం పార్టీకి చెందిన నాయకులను ఆకర్షించే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసిన శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ తిరిగి టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరిద్దరూ పార్టీ కండువాలు కప్పుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి కూడా పార్టీ మారనున్నారని వార్తలు వచ్చాయి. జితేందర్ రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారంటూ శుక్రవారం పుకార్లు షికార్లు చేశాయి.
ఈ నేపథ్యంలోనే ఈ పుకార్లు తన చెవిన పడిన వెంటనే జితేందర్ రెడ్డి ఘూటుగా స్పందించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపురంలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో మాట్లాడిన ఆయన పార్టీ మార్పుపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నువ్వా నన్ను కొనేది? నాకా మెసేజ్ పంపించేది? నా వెంట్రుక కూడా కొనలేవు. బీజేపీలోనే ఉంటా. బండి సంజయ్ ను సీఎం చేస్తా’ అని చెప్పుకొచ్చారు.
తనపై దుష్ప్రచారం చేస్తున్న వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన మాజీ ఎంపీ శ్రీ ఏ.పి. జితేందర్ రెడ్డి pic.twitter.com/cSOhzU3k0e
— BJP Telangana (@BJP4Telangana) October 21, 2022
జితేందర్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. బీజేపీ ప్రజల కోసం, దేశం కోసం పోరాడుతున్న పార్టీ అని వ్యాఖ్యానించారు. జితేందర్ రెడ్డి బీజేపీని వదిలి ఎక్కడికి పోడని తేల్చి చెప్పారు. బీజేపీ నుంచి ఎవర్ని తీసుకెళ్లిన మునుగోడులో 50,000 మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేను నారాయణపూర్‌లో ఉంటే టీవీలలో ప్రగతిభవన్‌లో ఉన్నానని వార్తలు వస్తున్నాయని, అవన్నీ తప్పుడు వార్తలని ఖండించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..



