Hyderabad: ఆసక్తికర సంఘటనకు వేదికైన గాంధీ భవన్.. జగ్గారెడ్డి మీసం మెలేసిన రేవంత్ రెడ్డి..
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గా రెడ్డిల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు గతంలో జరిగిన సంఘటనలు చెప్పకనే చెప్పాయి. దీంతో వీరిద్దరి మధ్య నెలకొన్న విబేధాలు గత కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ఓ ఆసక్తికర సంఘటన..

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గా రెడ్డిల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు గతంలో జరిగిన సంఘటనలు చెప్పకనే చెప్పాయి. దీంతో వీరిద్దరి మధ్య నెలకొన్న విబేధాలు గత కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. దీనికి హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికైంది. జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య జరిగిన ఓ సంఘటన ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర త్వరలోనే తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యాత్ర ఏర్పాట్లపై చర్చించేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలు శుక్రవారం గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ నెల 23న రాష్ట్రంలో రాహుల్ యాత్ర మొదలు కానుండగా… ఆ యాత్రను విజయవంతం చేయడానికి గల పలు విషయాలపై నేతలు చర్చించారు. మీటింగ్ అనంతరం టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరికొకరు తారసపడ్డారు.
ఈ సందర్భంగా ఇరు నేతలు కాసేపు సరదాగా మాట్లాడకున్నారు. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డి.. జగ్గారెడ్డి దగ్గరకు వెళ్లి మీసాలను మీసాలను మెలి తిప్పారు. ఆ తర్వాత జగ్గారెడ్డి కూడా నవ్వుతు మాట్లాడుతూ రేవంత్ చెవిలో ఏదో విషయాన్ని చెప్పారు. దీంతో ఇది చూసిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇద్దరు నాయకులకు కలిసిపోయారని, ఇది తమ పార్టీకి శుభ పరిణామమని ఖుషీ అవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..



