MLA Padma Devender Reddy: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం..
MLA Padma Devender Reddy: మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. పద్మా దేవేందర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుకనే వస్తున్న ఎస్కార్ట్ వాహనం
MLA Padma Devender Reddy: మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. పద్మా దేవేందర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుకనే వస్తున్న ఎస్కార్ట్ వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో పద్మాదేవేందర్ రెడ్డి వాహంలోనే ఉన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సురక్షితంగా ఉన్నట్లు సిబ్బంది వెల్లడించారు. బుధవారం మెదక్ జిల్లాలోని రామయంపేటలో జరుగుతున్న వివాహానికి హాజరు కావడానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అక్కన్న పేట రైల్వే గేట్ వద్ద ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును వెనకనే వస్తున్న (Road Accident) ఎస్కార్ట్ వాహనం వేగంగా ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే ఎలాంటి ప్రమాదం జరగలేదని.. వెంటనే అక్కడి నుంచి బయలుదేరినట్లు సిబ్బంది తెలిపారు.
కాగా.. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వాహనం ప్రమాదానికి గురైన సమాచారాన్ని తెలుసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు, ఆమె అభిమానులు ఆందోళన చెందారు. ఆమె క్షేమంగా ఉన్నారని.. ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Also Read: