Viral Video: సెకన్ల వ్యవధిలోనే రెండు నిండు ప్రాణాలు బలి.. ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్ వీడియో వైరల్..
Road Accident Viral Video: నెట్టింట తాజాగా ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కేవలం మూడు సెకన్ల వ్యవధిలోనే రెండు నిండు ప్రాణాలు లారీ చక్రాల కింద నలిగిపోయాయి.
Road Accident Viral Video: నెట్టింట తాజాగా ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కేవలం మూడు సెకన్ల వ్యవధిలోనే రెండు నిండు ప్రాణాలు లారీ చక్రాల కింద నలిగిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా.. సాధారణంగా దేశంలో ప్రతిరోజూ వందలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్లక్ష్యం, తాగి వాహనాలు నడపడం, ఇష్టం వచ్చినట్టు ఓవర్ టేకింగ్ చేయడం వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కాగా.. తాజాగా మహారాష్ట్రలోని వసాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. వసాయ్ (Vasai Accident Video) లో సోమవారం జరిగిన ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు వైరల్‌గా మారింది. ముంబై-అహ్మదాబాద్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమయంలో ఇద్దరూ హెల్మెట్ ధరించలేదు. మరోవైపు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పెల్హర్ ఫటా వద్ద ఈ ప్రమాదం జరిగింది. బైక్ ఎడమవైపు వెళుతోంది. ఇంతలో వెనుక నుంచి వచ్చిన కంటైనర్.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.
ఈ ప్రమాదం సోమవారం (మార్చి 21) జరిగింది. ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల మధ్య ఈ ఘటన జరిగింది. ప్రమాద దృశ్యాలు రోడ్డు పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ద్విచక్ర వాహనం హైవేపై వెళ్తుండగా.. వెనక నుంచే వచ్చి కార్గో కంటైనర్ ఢీకొంది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు మూడు సెకన్ల వ్యవధిలోనే మరణించారు.
వైరల్ వీడియో..
काळजाचा थरकाप उडवणारा भीषण अपघात! ठिकाण – वसई, मुंबई अहमबादाबाद महामार्ग, पेल्हार फाटा pic.twitter.com/JLgb8gS0yd
— Siddhesh Sawant (@ssidsawant) March 23, 2022
కాగా.. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తంచేశారు. భారతదేశ గణాంకాలు ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉన్నాయని నితిన్ గడ్కరీ ఇటీవల పేర్కొన్నారు. ఈ ప్రమాదాలను ఎలా అరికట్టాలనేది ప్రశ్నగా మారిందంటూ గడ్కరీ పేర్కొన్నారు.
Also Read: