AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR – Harish Rao: అద్భుతం.. మరమగ్గంపై 27 సుగంధ‌ ద్రవ్యాల‌తో ప‌ట్టు చీర‌ తయారీ.. నామకరణం చేసిన మంత్రులు..

పట్టుచీరల్లో ఎన్ని వెరైటీస్‌ ఉన్నా.. ఇప్పుడు మీకు చూపించబోయేది మాత్రం ఎప్పుడూ చూసుండరు. ఎందుకంటే, ఇది వన్‌ అండ్‌ ఓన్లీ సింగిల్‌ పీస్‌. ఆ చీర స్పెషాలిటీ ఏంటో చూడండి..

KTR - Harish Rao: అద్భుతం.. మరమగ్గంపై 27 సుగంధ‌ ద్రవ్యాల‌తో ప‌ట్టు చీర‌ తయారీ.. నామకరణం చేసిన మంత్రులు..
Ministers Ktr And Harish Rao
Shaik Madar Saheb
|

Updated on: Oct 08, 2022 | 9:05 PM

Share

సిరిసిల్ల నేతన్నల ప్రతిభకు దేశవ్యాప్తంగా పేరుంది. కంట్రీలోనే కాదు వరల్డ్‌ వైడ్‌గానూ సిరిసిల్ల కళాకారులకు మంచి గుర్తింపు ఉంది. మరమగ్గాలపై ఎన్నో ఆవిష్కరణలు, అద్భుతాలు సృష్టించారు సిరిసిల్ల నేతన్నలు. అగ్గిపెట్టెలో పట్టేంత పట్టుచీర, దబ్బనంలో దూరేంతటి అతిసన్నని చీర, మూడు కొంగుల చీర, ఉంగరంలో పట్టేంత శారీ, కుట్టులేని లాల్చీ పైజామా.. ఇలా, ఒకటా రెండా ఎన్నో అద్భుతాలు చేశారు సిరిసిల్ల నేతన్నలు. అదే ఉత్సాహం, అదే ఒరవడితో మరో నూతన ఆవిష్కరణ చేశారు చేనేత కార్మికులు నల్ల విజయ్‌. మరమగ్గంపై పరిమళాలు వెదజల్లే పట్టుచీరను తయారుచేసి అందర్నీ అబ్బురపర్చారు.

మొత్తం 27 రకాల సుగంధ ద్రవ్యాలతో ఈ చీరను రూపొందించారు. వినూత్న ఆలోచనతో తయారుచేసిన ఈ పట్టుచీరను మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు కలిసి ఆవిష్కరించారు. 27 రకాల సుగంధ ద్రవ్యాలతో రూపొందించిన ఈ పట్టుచీరకు సిరిచందనగా నామకరణం చేశారు కేటీఆర్‌, హరీష్‌ రావు. ఈ సందర్భంగా విజయ్ ను చీర గురించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

పరిమళాలు వెదజల్లే పట్టుచీరను మరమగ్గంపై నేసిన విజయ్‌ను అభినంభించారు. గతంలో, అగ్గిపెట్టెలో పట్టేంత పట్టుచీర, దబ్బనంలో దూరే అతిసన్నని చీర, మూడు కొంగుల చీర, ఉంగరంలో పట్టేంత శారీ, కుట్టులేని లాల్చీ పైజామాను తయారుచేసి అందరి దృష్టిని ఆకర్షించిన చేనేత కార్మికుడు నల్ల విజయ్‌, ఇప్పుడీ సుగంధ ద్రవ్యాల పట్టుచీరతో ప్రశంసలు అందుకుంటున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..