Hyderabad: కుండపోత వర్షానికి తడిసి ముద్దయిన హైదరాబాద్.. ఇబ్బందులు పడ్డ ప్రజలు.. మెట్రోలో పెరిగిన రద్దీ..

హైదరాబాద్ ను వర్షం వణికించింది. ఒక్కసారిగా కుండపోతగా కురిసిన వానకు రోడ్లు నదుల్లా మారాయి. మధ్యా్హ్నం ఎండ కాచినా సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. రాత్రి ఏడున్నర గంటల సమయంలో భారీ వర్షం కురిసింది....

Hyderabad: కుండపోత వర్షానికి తడిసి ముద్దయిన హైదరాబాద్.. ఇబ్బందులు పడ్డ ప్రజలు.. మెట్రోలో పెరిగిన రద్దీ..
Hyderabad Rains
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 08, 2022 | 8:24 PM

హైదరాబాద్ ను వర్షం వణికించింది. ఒక్కసారిగా కుండపోతగా కురిసిన వానకు రోడ్లు నదుల్లా మారాయి. మధ్యా్హ్నం ఎండ కాచినా సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. రాత్రి ఏడున్నర గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. మేఘాలకు చిల్లులు పడ్డాయా అన్నట్లుగా కుమ్మేసింది. దీంతో రోడ్లపై ప్రయాణించే వారు తడిసి ముద్దయ్యారు. మోకాలి లోతు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీస్ పని వేళలు ముగిసే సమయంలో కురిసిన వర్షంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. ముందుకు వెళ్లలేక, ఇళ్లకు చేరుకోలేక వానలోనే తడుస్తూ ప్రజలు కష్టాలు పడ్డారు. నగరంలోని గచ్చిబౌలి, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పూర్‌, గండిపేట, ఉప్పరపల్లి, సనత్‌నగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, మైత్రివనం, శేరిలింగంపల్లి, మాదాపూర్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మియాపూర్‌, అల్విన్‌కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, రాయదుర్గం, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట్‌, అల్వాల్‌, చిలకలగూడ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది.

ఆఫీస్ ల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, పనుల కోసం బయటకు వచ్చిన వారు వానకు తడిసి ముద్దయ్యారు. రోడ్లపై వరద నీరు పారుతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా కనిపించింది. కాగా.. నగర శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి, కోకాపేట్, గండిపేట, మణికొండ, పుప్పాల్ గూడా, హిమాయత్ సాగర్, బండ్లగూడ జాగిర్ ప్రాంతాల్లో వాన పడింది.

మరోవైపు.. జూబ్లీహిల్స్ లో అత్యధికంగా 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్ల డించారు. చందానగర్ లో 4.3 సెంటీమీటర్లు, అత్తాపూర్ లో 2.3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో బంజారాహిల్స్ లోని రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..