Vemula Prashanth Reddy: మానవత్వం చాటుకున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. పర్యటనలో బిజీగా ఉన్నా..
Vemula Prashanth Reddy: తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని చూసి..
Vemula Prashanth Reddy: తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని చూసి.. మంత్రి చలించిపోయారు. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించి.. అంబులెన్స్‌ను తెప్పించి క్షతగాత్రున్ని హాస్పిటల్ పంపించారు. అనంతరం అతని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి వేముల (Vemula Prashanth Reddy) ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళుతున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మంత్రి రామగుండం పర్యటనకు వెళుతుండగా.. మార్గమధ్యలో రోడ్డుపై పడిఉన్న క్షతగాత్రుడిని చూసి మంత్రి తన కాన్వాయ్‌ను ఆపించారు. ఓ టిప్పర్.. బైకర్‌ను (Road Accident) ఢీకొట్టింది. అనంతరం కొంత దూరం లాక్కుపోవడంతో బాధితుడి రెండు కాళ్ళు విరిగి రోడ్డుపై పడిపోయాడు. అది చూసిన మంత్రి వేముల వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేయమని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లే వరకు మంత్రి అక్కడే ఉండి క్షతగాత్రుడికి ధైర్యం చెప్పారు. అంబులెన్స్‌తో పాటు స్థానిక పోలీసును పంపించి మెరుగైన వైద్యం అందెలా చూడాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, స్థానికులు మంత్రి హోదాలో బిజీగా ఉన్నా.. వేముల మానవత్వం చాటుకున్నారని కొనియాడుతున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి అంతకుముందు కూడా రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయి.. కాన్వాయ్‌ను ఆపి వారిని ఆసుపత్రికి పంపిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు.
వీడియో..
Also Read: