Telangana High Court: తెలంగాణా హైకోర్టుకు 12 మంది కొత్త జడ్జీల నియామకానికి సుప్రీం కోర్టు ఆమోదం..
తెలంగాణ హైకోర్టుకు 12 మంది కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. కొత్తగా వస్తున్న జడ్జీలు అందరూ సీనియర్ న్యాయవాదులు, సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు.
Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు 12 మంది కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. కొత్తగా వస్తున్న జడ్జీలు అందరూ సీనియర్ న్యాయవాదులు, సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు. ఏడుగురు న్యాయవాదులు, ఐదుగురు జ్యూడిషియల్ ఆపీసర్లను జడ్డిలుగా సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. కోలీజియం సిఫార్సు చేసిన న్యాయవాదుల్లో కాసోజు సురేందర్, చాడ విజయ్ భాస్కర్ రెడ్డి, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాజి శ్రీదేవి, మీర్జా సైఫీయుల్లా బేగ్, నాచరాజు శ్రావణ్ కుమార్ వెంకట్ ఉన్నారు. అదే విధంగా ఐదుగురు న్యాయాధికారుల పదోన్నతికి కూడా కొలీజియం సిఫార్స్ చేసింది.
పదోన్నతికి సిఫార్స్ చేసిన వారిలో జీ.అనుపమ చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎం.సంతోష్ రెడ్డి, డీ.నాగార్జున ఉన్నారు.
ఇవి కూడా చదవండి: UP Assembly Election 2022: వర్చువల్ ర్యాలీలతో దూసుకుపోతున్న ప్రధాని మోడీ.. వెనకబడిన ప్రధాన పార్టీలు..