Ramanujacharya Sahasrabdi: ఘనంగా శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోత్సవం.. ముచ్చింతల్‌లో ప్రారంభమైన వేడుకలు..

శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం ప్రారంభం అవుతున్నది. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు దివ్య సాకేత రామచంద్రుడు అశ్వవాహనంపై శోభాయాత్ర గా వేంచేస్తారు. ఉదయం వాస్తుఆరాధన జరిగింది. సాయం కాలం 5 గంటలకు విష్వక్సేన ఆరాధనతో..

Ramanujacharya Sahasrabdi: ఘనంగా శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోత్సవం.. ముచ్చింతల్‌లో ప్రారంభమైన వేడుకలు..
Statue Of Equality
Follow us

|

Updated on: Feb 02, 2022 | 9:19 AM

Statue of Equality: ముచ్చింతల్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి ఆశ్రమం (Chinna Jeeyar Swamy Ashram) శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ ఉత్సవాలకు అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చకచక జరిగిపోతున్నాయి. రాష్ట్రపతి, ప్రధాని మోడీతోపాటు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే చిన్న జీయర్‌ స్వామి స్వయంగా ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అందించారు. చిన్న జీయర్‌ స్వామి ఆధ్యాత్మిక పరివర్తన క్షేత్రంలో సమతా స్ఫూర్తిని పంచిన రామానుజ విగ్రహ ఆవిష్కరణతో పాటు 108 విష్ణు ఆలయాలను సైతం ప్రతిష్టించనున్నారు.

అయితే.. ఈ ఉదయం శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం ప్రారంభం అవుతున్నది. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు దివ్య సాకేత రామచంద్రుడు అశ్వవాహనంపై శోభాయాత్ర గా వేంచేస్తారు. ఉదయం వాస్తుఆరాధన జరిగింది. సాయం కాలం 5 గంటలకు విష్వక్సేన ఆరాధన తో ప్రారంభమై అంకురారోపణ కార్యక్రమం జరగనున్నది.

ఉత్సవాలలో భాగంగా 12 రోజుల పాటు 128 యాగశాలల్లో ఐదువేల మంది రుత్విక్కులు నాలుగు వేదాలు పారాయణం చేయనున్నారు. హోమం, కోటిసార్లు నారాయణ జపం, కోటి హవన మహాక్రతువు, గోపూజలు నిర్వహిస్తున్నారు. హోమంలో వినియోగించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి రెండు లక్షల కిలోల దేశీ ఆవునెయ్యిని సేకరించారు.

ఇదిలావుంటే.. ఫిబ్రవరి 14న నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరు కానున్నారు.

ఇవి కూడా చదవండి: Guntur Jinnah Tower: గుంటూరులోని జిన్నా టవర్ కు జాతీయ జెండా రంగులు.. 3వ తేదీన..

జంతు ప్రదర్శనశాలలో దారుణం.. జూ కాపలదారునిపై దాడి చేసి చంపిన సింహం.. తర్వాత వేరే సింహంతో పరార్