Ramanujacharya Statue Inauguration: రామానుజ వేయేళ్లు జాతర..సహస్రాబ్ది వేడుకలకు వేళాయె..

సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. శ్రీ రామానుజ వేయేళ్ల జాతర మొదలుకాబోతుంది.  సమతామూర్తి  (Statue of Equality)గా పిలువబడే రామానుజాచార్య 218 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రపంచం చూడబోతోంది.

Ramanujacharya Statue Inauguration: రామానుజ వేయేళ్లు జాతర..సహస్రాబ్ది వేడుకలకు వేళాయె..
Statue Of Equality
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 02, 2022 | 10:14 AM

సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. శ్రీ రామానుజ వేయేళ్ల జాతర మొదలుకాబోతుంది.  సమతామూర్తి  (Statue of Equality)గా పిలువబడే రామానుజాచార్య 218 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రపంచం చూడబోతోంది. శ్రీ రామానుజాచార్య స్వామి(Sri Ramanujacharya) పదకొండవ శతాబ్దంలో భారతదేశంలో జన్మించిన హిందూ వేదాంతవేత్త తత్వవేత్త. భక్తి, శరణాగతి, సేవ వంటి సుగుణాలతో భగవంతుణ్ణి చేరుకోవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన మహా సాధ్వికుడు. ఆయన 1003వ జయంతిని పురస్కరించుకుని ఈ “స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ”ని ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్(Hyderabad) సమీపంలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ ఆశ్రమంలో కొలువుదీరనున్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

తెలంగాణ ఆధ్యాత్మిక సిగలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. అంటరానితనం, ఛాందసభావాలను రూపుమాపేందుకు కృషిచేసిన మహాసంస్కర్త మహా విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమైంది. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో 45 ఎకరాల సువిశాల స్థలంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి నిర్మించిన ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహం కానుంది.

రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల సందర్భంగా 14 రోజుల కార్యక్రమం నిర్వహించనున్నారు. ముచ్చింతల్‌ క్షేత్రంలో ఇవాళ (ఫిబ్రవరి 2) నుంచి 14వ వరకు జరగనున్నాయి. సమతా మూర్తి భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా.. సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్రమంత్రులు, తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. పద్మపీఠంపై పద్మాసనంలో కూర్చున్న భంగిమలో ఉన్న 216 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. అలాగే, ఫిబ్రవరి 13న 120 కిలోల బంగారు రామానుచార్య బంగారు విగ్రహాన్నిరాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.

Also Read.. Budget 2022: బడ్జెట్‌ ఎఫెక్ట్‌.. ధరలు తగ్గే వస్తువులు ఇవే..