Cyber Crime: లైకులు కొడితే చాలు డబ్బులొస్తాయన్నారు.. చివరకు నట్టేట ముంచారు.. భారీ సైబర్ క్రైమ్..
Hyderabad Cyber Crime: దేశంలో సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. సైబర్ నేరస్థులు రోజుకో విధంగా రెచ్చిపోతూనే ఉన్నారు.

Hyderabad Cyber Crime: దేశంలో సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. సైబర్ నేరస్థులు రోజుకో విధంగా రెచ్చిపోతూనే ఉన్నారు. బహుమతులు, రివార్డులు, ఉద్యోగాలు అంటూ నేరస్థులు అమాయకులను మాయచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఎల్‌ఈడీ బల్బులకు సంబంధించిన యాడ్స్‌పై లైక్‌లు కొడితే డబ్బులొస్తాయని నమ్మించారు. చివరకు రూ.20 లక్షలు కాజేశారని (Hyderabad) నగరానికి చెందిన ఓ బాధితుడు హైదరాబాద్ సైబర్ (Cyber Police) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన శ్రీను సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించే మార్గం అనే ప్రకటన కనిపించగానే ఆ లింక్‌పై క్లిక్ చేశారు. ఆ తర్వాత అవతలి వ్యక్తి వాట్సాప్ కాల్ ద్వారా శ్రీనును సంప్రదించి రూ.10 లక్షలు పెట్టండి కొన్ని యాడ్స్ పంపిస్తామని మొత్తం వివరించాడు. దానికి పెద్దగా పనిచేయాల్సిందేం లేదని.. యాడ్స్‌కు లైక్ కొడితే సరిపోతుందని పేర్కొన్నాడు.
సైబర్ నేరస్థుడి మాటలను నమ్మిన శ్రీను.. అతను చెప్పిన ఖాతాకు పలు దఫాలుగా రూ.20 లక్షలను పంపాడు. ఆ తర్వాత యాడ్స్ వచ్చాయి. అయితే.. వాటికి లైక్ కొట్టగా.. రూ.20 లక్షల పెట్టుబడికి రూ.40 లక్షల వరకు లాభం వచ్చినట్లు యాప్‌లో చూపిస్తుందని.. కానీ డబ్బులు రావడం లేదని శ్రీను పేర్కొన్నారు. తీరా మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
మరో ఘటనలో రూ.10 లక్షలు.. ఇదిలాఉంటే.. మరో ఘటనలో ఏడుగురు రూ.10 లక్షల మేర మోసపోయారు. బహదూర్‌పురకు చెందిన ఖాజా వాట్సాప్‌కు న్యూ మొబైల్ మీడియా ఇన్వెస్ట్‌మెంట్ యాప్ లింక్ వచ్చింది. లింక్ క్లిక్ చేసి తొలుత రూ.10వేలు పెట్టుబడి పెట్టాడు. రోజు లాభం కింద రూ. 470 చూపిస్తుండటంతో అతని స్నేహితులకు చెప్పాడు. మొత్తం ఏడుగురు రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారు. తర్వాత యాప్ పని చేయకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Also Read:
