Jharkhand: ఘోర ప్రమాదం.. అక్రమ గనిలో 13 మంది మృతి.. పనిచేస్తుండగా..

Dhanbad mine mishap: జార్ఖండ్‌‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో అక్రమ బొగ్గు గని కూలిపోయిన దుర్ఘటనలో

Jharkhand: ఘోర ప్రమాదం.. అక్రమ గనిలో 13 మంది మృతి.. పనిచేస్తుండగా..
Coal Mine
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 02, 2022 | 10:39 AM

Dhanbad mine mishap: జార్ఖండ్‌‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో అక్రమ బొగ్గు గని కూలిపోయిన దుర్ఘటనలో 13 మంది కార్మికులు మరణించారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మంగళవారం చోటుచేసుకుంది. మరికొంత మంది బొగ్గు గనిలో చిక్కుకున్నట్లు స్థానికులు, అధికారులు పేర్కొంటున్నారు. కూలిపోయిన బొగ్గు గని (coal mine) వద్ద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ధన్‌బాద్‌ (Dhanbad) లోని నిర్సా బ్లాక్‌లోని ఈసీఎల్ ముగ్మా ప్రాంతంలో ఉన్న అక్రమ మైనింగ్‌లో ఈ ఘటన జరిగింది. మూసివున్న బొగ్గు గనిని చట్టవిరుద్ధంగా తెరిచినట్లు పేర్కొంటున్నారు. అయితే.. మైనింగ్ పరికరాలు 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో గని పైకప్పు మొత్తం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మరో 12మందికి పైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే కొంత మందిని రక్షించినట్లు స్థానికులు వెల్లడించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.

కాగా.. పోలీసులు ఐదు మరణాలను మాత్రమే ధృవీకరిస్తున్నారు. అయితే.. గోపీనాథ్‌పూర్ కొలీరీ మేనేజర్ ఎల్‌కే సింగ్ నిర్సా పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. బొగ్గును దోచుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. కాగా.. ఈ ప్రమాదం పలు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో.. ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. రూరల్‌ ఎస్పీ రిష్మా రమేషన్‌ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

Also Read:

ఏటీఎం చోరీకి అంతా ఓకే.. అప్పుడే ఓ వాహనం రావడంతో సీన్ రివర్స్.. చివరకు..

SSC MTS Exam: ప్రభుత్వ శాఖల్లో మల్టీ-టాస్కింగ్ జాబ్స్.. SSC MTS పరీక్షలో ఉద్యోగ అవకాశాలు….