AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramanujacharya Sahasrabdi: ముచ్చింతల్‌లో మొదలైన ఆధ్యాత్మిక సందడి.. జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి శోభాయాత్రగా..

హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్‌లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. దీనిలో భాగం జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల వరకు శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ భోశాయాత్రలో..

Ramanujacharya Sahasrabdi: ముచ్చింతల్‌లో మొదలైన ఆధ్యాత్మిక సందడి.. జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి శోభాయాత్రగా..
Statue Of Equality Sri Chinna Jeeyar Swamy
Sanjay Kasula
|

Updated on: Feb 02, 2022 | 1:29 PM

Share

Statue of Equality:హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్‌లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. దీనిలో భాగం జీయర్ ఆస్పత్రి(Jeeyar JIMS Hospital) ప్రాంగణం నుంచి యాగశాల వరకు శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ భోశాయాత్రలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామితో((Chinna Jeeyar Swamy)) పాటు పలువురు స్వామీజీలు, వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఉత్సవాలలో అత్యంత కీలకమైన హోమాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం అరణి మథనం, అగ్ని ప్రతిష్టం నిర్వహిస్తారు. వెయ్యి 35 కుండాలతో కూడిన లక్ష్మీనారాయణ మహా యాగంతో వేడుకలను ప్రారంభిస్తున్నారు. తొలుత ఆ ప్రాంత భూమి పూజ, వాస్తు పూజ నిర్వహిస్తారు. వివిధ సంప్రదాయాలను అనుసరించే 5 వేల మంది రుత్వికులు దీక్షధారణ చేసి పూజల్లో పాల్గొంటున్నారు. ఈ సాయంత్రం కుండల్లోని పుట్టమట్టిలో నవధాన్యాలను అలకటం ద్వారా అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు.

ప్రాణికోటి అంతా ఒకటేనని..

వెయ్యేళ్ల కిందట ఎన్నో వైషమ్యాలు, వైరుధ్యాలు.. అంటరానితనం కరాళనృత్యం చేస్తున్న సమయంలో ప్రాణికోటి అంతా ఒకటేనని, మనుషుల మధ్య తేడాల్లేవని ఈ లోకానికి  సమానత్వ భావాలను నాటారు ఆచార్య రామానుజులు. మళ్లీ ఇప్పుడు అసమానతలు దేశ పురోగతికి అడ్డంకిగా మారుతున్న సమయంలో ఆయన నింపిన స్ఫూర్తి మరోసారి ప్రజల్లో రావాల్సిన అవసరం ఉందంటూ చిన్నజీయర్‌ స్వామి ఈ బృహత్‌ క్షేత్ర నిర్మాణానికి పూనుకున్నారు.

బుధవారం ఉదయం 8 గంటలకు శోభాయాత్ర, వాస్తుశాంతి, రుత్విక వరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 8 గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఉత్సవాల్లో కీలకమైన హోమాలు మొదలు కానున్నాయి.

అరణి మతనం, అగ్నిప్రతిష్ట జరుగనున్నాయి. కార్య్రక్రమాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో 7 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు.

ఇవి కూడా చదవండి:  Ramanujacharya Sahasrabdi: ఘనంగా శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోత్సవం.. ముచ్చింతల్ లో ప్రారంభమైన వేడుకలు..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్