DU Students Protest: లేడీస్‌ హాస్టల్‌ స్థానంలో గోశాల..! ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్ధుల నిరసన గళం..

ఇది గోశాల కాదు.. పరిశోధన ప్రయోజనాల కోసం స్వామి దయానంద్ కౌ ప్రొటెక్షన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో కేవలం ఒక ఆవు మాత్రమే ఉంది. పైగా ఆ స్థలం లేడీస్ హాస్టల్ నిర్మాణానికి అనుకూలంగా లేదు..

DU Students Protest: లేడీస్‌ హాస్టల్‌ స్థానంలో గోశాల..! ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్ధుల నిరసన గళం..
Gushala At Delhi University
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 02, 2022 | 3:45 PM

Delhi University students protest against gaushala: ఢిల్లీ యూనివర్శిటీ (Delhi University)లోని హన్స్‌రాజ్ కాలేజీ క్యాంపస్‌ (Hansraj College Campus)లో గోసంరక్షణ, పరిశోధనా కేంద్రాన్ని (cow protection and research centre) ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు జనవరి 31 (సోమవారం) నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గోశాలకు బదులుగా ఆ ప్రదేశంలో లేడీస్‌ హాస్టల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. లేడీస్‌ హాస్టల్ కోసం కేటాయించిన స్థలంలో ‘గోశాల’ నిర్మించారని హన్సరాజ్ కాలేజీకి చెందిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ ఆరోపించింది. ‘గోశాల’ను వెంటనే తొలగించాలని, ఆ స్థలంలో లేడీస్‌ హాస్టల్‌ను నిర్మించాలని విద్యార్థులు కోరారు. మరోవైపు ఇది ‘గోశాల’ కాదని, పరిశోధన ప్రయోజనాల కోసం స్వామి దయానంద్ కౌ ప్రొటెక్షన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో కేవలం ఒక ఆవు మాత్రమే ఉందని హన్సరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామశర్మ మీడియాకు తెలిపారు. రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసిన స్థలంలో హాస్టల్‌ను నిర్మించేందుకు అనుకూలంగా లేదని ఆర్కిటెక్ట్‌లు కూడా చెప్పినట్లు ఆమె తెలిపారు.

యూనివర్సిటీలో చదివే విద్యార్ధినులకు సరైన సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనదని, సొంత ఊర్లను వదిలి నగరాల్లో చదువుకోవాలనే ఆకాంక్షను నిరుత్సాహపరుస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ యూనిట్ కార్యదర్శి ముష్ఫిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ యూనివర్శిటీలో మహిళా విద్యార్ధుల కోసం కేవలం కొన్ని హాస్టళ్లు మాత్రమే ఉండగా, ‘గోశాల’ నిర్మాణం చేపట్టడం సిగ్గుచేటని ఎస్‌ఎఫ్‌ఐ, హిందూ కళాశాల యూనిట్ ప్రెసిడెంట్ అదితి త్యాగి అన్నారు. ప్రతి కాలేజ్‌లో హాస్టల్‌ నిర్మించాలని కోరుతూ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ తెల్పింది. అనంతరం ‘ప్రభుత్వ విద్యను కాపాడండి’, ‘విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వండి’, ‘విద్యను కాషాయీకరణ చేయవద్దు’.. వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను విద్యార్ధులు పట్టుకుని కాలేజ్‌ వెలుపల నిరసనలు వ్యక్తం చేశారు.

 Also Read:

IIFT MBA (IB) Results 2022: ఐఐఎఫ్‌టీలో ఎంబీఏ- 2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఈ విధంగా చెక్‌ చేసుకోండి