AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIFT MBA (IB) Results 2022: ఐఐఎఫ్‌టీలో ఎంబీఏ- 2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఈ విధంగా చెక్‌ చేసుకోండి

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) IIFT MBA (IB) 2022 ప్రవేశ పరీక్ష ఫలితాలను తాజాగా ప్రకటించింది. MBA (IB)లో 2022-24 విద్యాసంవత్సారినిగానూ..

IIFT MBA (IB) Results 2022: ఐఐఎఫ్‌టీలో ఎంబీఏ- 2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఈ విధంగా చెక్‌ చేసుకోండి
Mba Results
Srilakshmi C
|

Updated on: Feb 02, 2022 | 12:10 PM

Share

IIFT MBA IB Admissionత 2022: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) IIFT MBA (IB) 2022 ప్రవేశ పరీక్ష ఫలితాలను తాజాగా ప్రకటించింది. MBA (IB)లో 2022-24 విద్యాసంవత్సారినిగానూ న్యూఢిల్లీ, కోల్‌కతా, కాకినాడ (AP) క్యాంపస్‌లలో ప్రవేశాలకు డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మోడ్‌లో ప్రవేశ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iift.nta.nic.inలో తనిఖీ చేసుకోవచ్చు.ఈ పరీక్షకు సంబంధించి NTA గతంలో ఆన్సర్‌ కీని కూడా విడుదల చేసింది. అభ్యర్ధుల అవసరార్థం రెస్పాన్స్‌ షీట్, క్వశ్చన్‌ పేపర్లను అప్‌లోడ్ చేసింది. ఆన్సర్ కీలో ఏమైనా అభ్యంతరాలుంటే తనిఖీ చేసుకోవడానికి తగిన సమయం కూడా ఇచ్చింది. కాగా సందేహాలన్నింటిని నివృతి చేసినతర్వాతే ఎన్టీఏ ఫలితాలు వెలువరించింది.

IIFT MBA (IB) 2022 ఫలితాలను ఈ కింది విధంగా చెక్‌ చేసుకోండి…

  • మొదట అధికారిక వెబ్‌సైట్‌ iift.nta.nic.inను ఓపెన్‌ చేయాలి
  • తర్వాత హోమ్‌పేజీలో స్కోర్‌కార్డ్ లింక్‌పై క్లిక్ చేయాలి
  • అవసరమైన వివకాలను నమోదు చేయాలి
  • స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి
  • తదుపరి అవసరాల నిమిత్తం స్కోర్‌కార్డ్‌ను సేవ్‌ చేసి, డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

Also Read:

IGNOU Admission 2022: ఇగ్నో జనవరి సెషన్‌ 2022 అడ్మిషన్లకు చివరి తేదీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..