IGNOU Admission 2022: ఇగ్నో జనవరి సెషన్ 2022 అడ్మిషన్లకు చివరి తేదీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) ఓపెన్ అండ్ డిస్టెన్స్ మోడ్ (ODL)లో 2022 విద్యాసంవత్సరానికిగాను (జనవరి సెషన్) ప్రవేశాలకు చివరితేదీని పొడిగిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను..
IGNOU Admission 2022 January Session last date: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) ఓపెన్ అండ్ డిస్టెన్స్ మోడ్ (ODL)లో 2022 విద్యాసంవత్సరానికిగాను (జనవరి సెషన్) ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీని తాజాగా ఫిబ్రవరి 10 వరకు పొడిగించింది. ఇప్పటివరకు ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఎవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్ (ignouadmission.samarth.edu.in)లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అసక్తి కలిగిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకునే సమయంలో న్యూ రిజిస్ట్రేషన్‌ను క్రియేట్ చేసుకుని, అవసరమైన అన్ని వివరాలను సమర్పించాలి. అలాగే ఏ కోర్సులో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కేటగిరీని కూడా ఎంచుకోవాలి. చివరిగా ఆన్‌లైన్ అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేసేముందుగా ఇచ్చిన సూచనలన్నింటినీ తరవుగా చదువుకుని సబ్‌మిట్ చేయవల్సి ఉంటుంది. కాగా ఇగ్నో వృత్తి విద్య, శిక్షణను ఉన్నత విద్యతో అనుసంధానం చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ (MSDE) మంత్రిత్వ శాఖతో 2022 జనవరి 18న ఒప్పందం కుదుర్చుకుంది. దేశ యువతకు ఉద్యోగ లేదా పని అవకాశాలను సృష్టించడం, వొకేషనల్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్ధేశ్యం.
అధికారిక సమాచారం ప్రకారం.. దాదాపు 32 నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లు(NSTI), 3000 ITIలు, 500 ప్రధాన మంత్రి కౌశల్ కేంద్ర (PMKK), 300 JSSలు రిజిస్ట్రేషన్, పరీక్ష, పని కేంద్రాలుగా వర్సిటీతో అనుబంధించబడతాయి.
Also Read: