AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Schools Reopen: ఫిబ్రవరి 15 నుంచి పాఠశాలలు ఓపెన్‌.. ప్రకటించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి

Schools Reopen: కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలకు భారీ ఎదురుదెబ్బ తగులుతోంది. రెండేళ్లుగా విజృంభిస్తున్న కరోనా.. పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడం..

Schools Reopen: ఫిబ్రవరి 15 నుంచి పాఠశాలలు ఓపెన్‌.. ప్రకటించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి
Subhash Goud
|

Updated on: Feb 02, 2022 | 1:38 PM

Share

Schools Reopen: కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలకు భారీ ఎదురుదెబ్బ తగులుతోంది. రెండేళ్లుగా విజృంభిస్తున్న కరోనా.. పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడం లేదు. ఇప్పుడిప్పుడు తగ్గుముఖం పడుతుందనే లోగా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్‌తో పాటు కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ థర్డ్‌వేవ్‌ రూపంలో ముంచుకొస్తున్నాయి. దీంతో దేశంలో విద్యాసంస్థలన్నీ మూతపడగా, కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడు తెరుచుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇక అసోం రాష్ట్రంలో మూతపడిన పాఠశాలలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి తిరిగి ఓపెన్‌ చేయాలని భావిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు.

రాబోయే రోజుల్లో కర్ఫ్యూ సమయ వేళలు తగ్గింపు:

కరోనా పరిస్థితులు, పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక రాబోయే రోజుల్లో కర్ఫ్యూ సమయాల్లో సడలింపులను కూడా ఉంటాయని ఆయన వెల్లడించారు. అసోం రాష్ట్రంలో రోజు వారీ కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 2 వేలకు చేరుకుంది. రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ సమయాలు రాత్రి 11 గంటల వరకు సడలించబడతాయని అన్నారు.

ఇప్పటి వరకు 9 లక్షల మంది పిల్లలకు టీకాలు..

కాగా, అసోం రాష్ట్రంలో ఇప్పటి వరకు 15 నుంచి 18 ఏళ్లలోపు ఉన్న 9 లక్షల మంది పిల్లలకు టీకాలు వేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక పాఠశాలలు తెరిచినట్లయితే మరికొంత మంది పిల్లలకు టీకలు వేయవచ్చని, దీంతో టీకాలు వేయడం మరింత సులభం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

Petrol Diesel Price: నిర్మలమ్మ పద్దులో వాహనదారులకు షాక్‌.. పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఎప్పటి నుంచి అంటే..!

Budget 2022: కేంద్రం గుడ్‌న్యూస్‌.. రూ.10 లక్షల వరకు ఉన్న ఆదాయానికి పన్ను ఉండదు.. ఎవరికో తెలుసా..?