AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొత్త రేషన్ కార్డు జాబితాలో పేరు లేని వారికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి ఉత్తమ్…

జనవరి 26 నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ షురూ అవ్వనుంది. ఇప్పటికే గ్రామాల్లో లబ్ధిదారులకు సంబంధించిన జాబితాలు అందుబాటులో ఉంచారు. అయితే అప్లై చేసినా ఆయా లిస్టుల్లో పేర్లు లేని వారు ఆందోళన చెందుతున్నారు. కొత్త రేషన్ కార్డు జాబితాలో పేరు లేని వారికి శుభవార్త చెబుతూ మంత్రి కీలక ప్రకటన చేశారు.

Telangana: కొత్త రేషన్ కార్డు జాబితాలో పేరు లేని వారికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి ఉత్తమ్...
Telangana New Ration Cards
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jan 18, 2025 | 8:27 PM

Share

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి 26 నుంచి రాష్ట్రంలో 3 కొత్త పథకాలు షురూ అవ్వవనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అన్నదాతలకు రైతు భరోసా పథకంతో పాటు రైతు కూలీలకు ఇందిరా ఆత్మీయ భరోసా పథకంతో ఇక ఎంతోమంది ఎదురుచూస్తోన్న కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కూడా అదే రోజు శ్రీకారం చుట్టునున్నారు. ఈ మేరకు.. గ్రామాల్లో సర్వేలు చివర స్టేజ్‌కు వచ్చాయి. ఆ ప్రక్రియలో భాగంలో.. పల్లెల్లో కొత్త రేషన్ కార్డులు పొందినవారి జాబితాలు పొందుపరుస్తున్నారు. అయితే.. ఈ లిస్టుల్లో పేర్లు లేకపోవటంతో.. చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు ఎదురుచూసినా తమకు కొత్త రేషన్ కార్డులు రావేమో అని.. హైరానా పడుతున్నారు. ఈ సందర్భంగా.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం స్పష్టత ఇచ్చారు. పాత రేషన్ కార్డులు తొలగిస్తామని జరుగుతోన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు. పాత రేషన్ కార్డులు అలాగే ఉంటాయని క్లియర్ కట్‌గా చెప్పేశారు. దరఖాస్తు పెట్టుకున్నట్లయితే పాత రేషన్‌ కార్డుల్లో… కొత్తవారిని కూడా చేరుస్తామని కూడా వివరణ ఇచ్చారు. ఇటవల చేసిన క్యాస్ట్ సెన్సస్ రిపోర్ట్ ఆధారంగానే రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే.. ప్రస్తుతం ప్రకటిస్తున్న జాబితాల్లో పేర్లు లేకపోతే టెన్షన్ పడొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామ సభల్లో మళ్లీ అప్లై చేసుకోవచ్చని సూచించారు. అంతేకాకుండా రేషన్ కార్డులు పంపిణీ అనేది నిరంతరంగా కొనసాగుతుందని చెప్పారు. మంత్రి ప్రకటనతో.. ప్రస్తుతం జాబితాల్లో పేర్లు లేనివారికి ఊరట లభించింది. కాగా రేషన్ కార్డు అర్హత ఉండి కూడా రాకుంటే.. సంబంధిత అధికారికి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వొచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి