Telangana: ఆ పబ్స్ వెంటనే క్లోజ్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్

శుక్ర, శని వారాల్లో రాత్రి 1 గంటవరకు పబ్‌లకు అనుమతి ఉందని.. మిగతా వారాల్లో 12 గంటలకే క్లోజ్ చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ యాజమాన్యాలకు సూచించారు. సమయం దాటితే పబ్ పై కటిన చర్యలుంటాయన్నారు.

Telangana: ఆ పబ్స్ వెంటనే క్లోజ్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్
Srinivas Goud
Follow us

|

Updated on: Apr 09, 2022 | 1:13 PM

రాష్ట్రంలో డ్రగ్స్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ మంత్రి( Excise Minister  Srinivas Goud ) శ్రీనివాస్ గౌడ్‌. పబ్‌ యాజమానులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఉన్న మంచి పేరు చెడిపోకుండా చూడాలని అందరికి సూచించారు శ్రీనివాస్‌ గౌడ్‌. ఈ సమావేశానికి ఆబ్కారీ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. కొన్ని చీడపురుగుల వల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు శ్రీనివాస్‌ గౌడ్‌. పబ్‌ల్లో డ్రగ్స్‌(Drugs) వ్యవహారం నిన్న మొన్నటిది కాదన్నారు. డ్రగ్‌ దందాలో ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. టీఆర్‌ఎస్‌(Trs) నేతలకు ప్రమేయం ఉంటే.. కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇది ఉద్యమం చేసి త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ అని.. డ్రగ్స్ దందా చేయాలనుకునే వాళ్ళు రాష్ట్రం దాటి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. డబ్బు కోసం ఇలాంటి వృత్తిని చేసేవాళ్ళు కుటుంబాలను కూడా అమ్ముకునేందుకు తెగిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి. గతంలో సమావేశం పెట్టి హెచ్చరించినా పబ్స్ తీరు మారలేదని.. ఇలానే వ్యవహరిస్తే.. పబ్‌లు మొత్తం మూసివేయడానికి కూడా ప్రభుత్వం వెనకాడదని వార్నింగ్ ఇచ్చారు.

శుక్ర, శని వారాల్లో రాత్రి 1 గంటవరకు పబ్‌లకు అనుమతి ఉందని.. మిగతా వారాల్లో 12 గంటలకే క్లోజ్ చేయాలని సూచించారు. సమయం దాటితే పబ్ పై కటిన చర్యలుంటాయన్నారు. పబ్‌లు టైమ్ దాటాక కూడా నడిపితే ఆ పరిధిలోని పోలీస్, ఎక్సయిజ్ అధికారులపై వేటు పడుతుందని చెప్పారు. హైదరాబాద్ లో మొత్తం 61 పబ్స్ ఉన్నాయని.. అన్ని పబ్స్‌లో సీసీటీవీ కెమెరాలు తప్పకుండా ఉండాలన్నారు. సీసీటీవీ కెమెరాలు లేని పబ్‌లను వెంటనే సీజ్ చేస్తామని చెప్పారు. కెమెరాలు పెట్టిన తర్వాతనే వాటిని తెరిచేందుకు అనుమతిస్తామన్నారు. ప్రతి పబ్ సీసీటీవీ కెమెరాలను ఎక్సైజ్ శాఖ కేజ్‌కు అనుసంధానం చేయాలన్నారు. పబ్స్‌లో సౌండ్ సిస్టం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలగకుండా యాజమాన్యలు చూసుకోవాలని సూచించారు.

Also Read: తెలుగులోనే ‘శ్రీవల్లి’ సాంగ్ పాడిన తమిళ కలెక్టర్.. వావ్ అనకుండా ఉండలేరు

మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..